నెలకు 3.5 కోట్ల ఆదాయం.. అవాక్కైన పోలీసులు, పుడింగ్ మింక్ పబ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Siva Kodati |  
Published : Apr 08, 2022, 06:41 PM IST
నెలకు 3.5 కోట్ల ఆదాయం.. అవాక్కైన పోలీసులు, పుడింగ్ మింక్ పబ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

సారాంశం

హైదరాబాద్ పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీకి సంబంధించి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పబ్‌కు నెలకు 3.5 కోట్ల ఆదాయం వస్తుండటంతో పోలీసులే అవాక్కయ్యారు. 

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని (banjara hills rave party) ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఓనర్ అభిషేక్ ఉప్పలకు (abhishek uppala pub)  గోవా, ముంబైలలో వ్యక్తులతో సంబంధాలు వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పబ్ మేనేజర్ అనిల్ కుమార్‌కు డ్రగ్స్ పెడ్లర్‌లతో సంబంధాలు వున్నట్లు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న కిరణ్ రాజు, అర్జున్ మాచినేనిలపైనా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఇద్దరూ దొరికితే డ్రగ్స్ సరఫరా ఎవరు చేశారు అన్న దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం వుంది. డ్రగ్స్ తీసుకున్న 20 మంది ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

మరోవైపు .. మింక్ పబ్ ఆదాయం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ప్రతి నెలా మూడున్నర కోట్లు ఆదాయం వస్తున్నట్లు గుర్తించారు. ప్రతి వీకెండ్‌లో 30 నుంచి 40 లక్షల ఆదాయం వస్తున్నట్లు తేల్చారు. సాధారణ రోజుల్లో రోజుకు పది లక్షల వరకు బిజినెస్ అవుతున్నట్లు గుర్తించారు. ఆదాయంలోని కొంత భాగం లంచాలకు ఇస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ తీసుకున్న 20 మంది ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున Pudding Mink Pub లో టాస్క్‌పోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడి సమయంలో పబ్ లో 145 మంది ఉన్నారు. అంతేకాదు పబ్ లో సుమారు 4.5 గ్రాముల కొకైన్ కూడా police సీజ్ చేశారు. అయితే ఈ  పబ్ లోకి డ్రగ్స్  ఎలా వచ్చాయనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై అరెస్టైన పబ్ మేనేజర్  అనిల్ కుమార్, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పలను పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ ఇద్దరిని కనీసం 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పబ్  కేసులో అరెస్టైన Anil kumar, అభిషేక్  ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.  అనిల్ కుమార్ కాంటాక్ట్ లిస్టులో డ్రగ్స్ ను సరఫరా చేస్తూ గతంలో పట్టుబడిన పెడ్లర్ల ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించారు.

ఈ పబ్ కు శనివారం రాత్రి నుండి ఆదివారం నాడు తెల్లవారుజాము వరకు 250 మంది వచ్చారని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ పబ్ పై దాడి చేసిన సమయంలో 145 మంది పబ్ లో ఉన్నారు. అయితే ఇంకా 105  మందిని కూడా పోలీసులు గుర్తించి వారిని కూడా విచారించనున్నారు. ఈ పబ్ కి వచ్చిన వారు డ్రగ్స్ వినియోగించినట్టుగా పోలీసులు ఆధారాలను సేకరించారు. అయితే ఈ డ్రగ్స్ ఎవరు తీసుకొన్నారనే విషయమై నిర్ధారణ కావాల్సి ఉంది. 

ఈ పబ్ లో  మూడు టేబుల్స్ ను రిజర్వ్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 15 నుండి 20 మంది వచ్చారు.అప్పటి వరకు ఈ మూడు టేబుల్స్ ను పబ్ యాజమాన్యం ఎవరికీ కూడా కేటాయించలేదు.తెల్లవారుజాము సమయంలో ఈ మూడు టేబుల్స్ ను 20 మంది వినియోగించారని పోలీసులు గుర్తించారు. ఈ మూడు టేబుల్స్ కు ఇద్దరు మాత్రమే సర్వ్ చేశారని కూడా పోలీసులు గుర్తించారు. ఈ మూడు టేబుల్స్ ను వినియోగించింది ఎవరు, వారికి ఏ రకమైన పదార్ధాలు సర్వ్ చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu