130 మంది ఎంపిడీవోల 21ఏళ్ళ నిరీక్షణ.... సీఎం నిర్ణయంతో సాకారం

By Arun Kumar PFirst Published Sep 3, 2018, 4:58 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులపై అమితమైన ప్రేమను ప్రదర్శిస్తుంటారు. నూతన తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఉద్యోగుల పక్షాన నిలుస్తూ వారికి అండదండలు అందిస్తున్నారు. అయితే తాజాగా తీసుకున్న మరో నిర్ణయం రాష్ట్రంలోని 130 మంది ఎంపిడీవోల 21 ఏళ్ల నిరీక్షణను దూరం చేసింది.

సీఎం కేసీఆర్ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 130 మంది ఎంపిడీవో (మండల పరిషత్ డెవలప్ మెంట్ ఆపీసర్ల)లకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలు పై సంతకం చేశారు. దీంతో గత 21 ఏళ్లుగా పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న ఎంపీడివోల కల నెరవేరింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతన తెలంగాణ రాష్ట్రంలోనూ తమ పదోన్నతుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినట్లు ఎంపీడివోలు తెలిపారు. అయితే చివరకు సీఎం కేసీఆర్, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తమ అభ్యర్థనను మన్నించి పదోన్నతులను కల్పించడం ఆనందంగా ఉందన్నారు. తమ ఆకాంక్షను నెరవేర్చిన సీఎంకు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఉద్యోగులకు సంబంధించిన మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు సీఎం. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి 1.572 శాతం డిఏ చెల్లించాలనే ఉత్తర్వులపై సిఎం సోమవారం సంతకం చేశారు. ఈ పెంపుతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ  27.24 శాతానికి చేరుకుంది.
 
click me!