యాక్షన్‌లోకి ప్రియాంక గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై భేటీ

Siva Kodati |  
Published : Aug 27, 2022, 08:44 PM IST
యాక్షన్‌లోకి ప్రియాంక గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై భేటీ

సారాంశం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలపై ప్రియాంక గాంధీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఆమె చర్చిస్తున్నారు.   

దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జీగా ఇటీవల నియమితులైన ప్రియాంక గాంధీ యాక్షన్‌లోకి దిగారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలపై శనివారం ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్, రోహిత్ చౌదరిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఆమె చర్చిస్తున్నారు. 

ఇకపోతే.. బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయపరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారన్నారు. సుమారు 40 నిమిషాలపాటు పార్టీకి చెందిన అంశాలపై చర్చించామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.  ప్రియాంక గాంధీపై చర్చించిన పార్టీ అంతర్గత విషయాలను తాను మీడియాకు చెప్పబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పుడైనా తనతో చెప్పాలని ప్రియాంక గాంధీ తనకు సూచించారనన్నారు. తనకు కూడా ప్రియాంక గాంధీ కొన్ని సలహాలు, సూచనలు చేశారని కూడా కోమటిరెడ్డి చెప్పారు.

ALso REad:ఇందిరలాగే ప్రియాంక కూడా మెదక్ నుంచి పోటీ చేయాలి : వీహెచ్ కొత్త డిమాండ్

అంతకుముందు రెండు రోజుల క్రితం కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. తనను నిత్యం అవమానిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్దితో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ విషయమై సోనియాగాంధీకి లేఖ రాశారు.. దీంతో ప్రియాంక గాంధీ నుండి ఆహ్వానం రావడంతో కోమటిరెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కూడా  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపిక విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో చర్చించాలని పార్టీ నేతలకు ప్రియాంక గాంధీ సూచించారు. ఆయనని కలుపుకుని వెళ్లాలని, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిపై వెంకట్ రెడ్డితో చర్చించాలని పార్టీ రాష్ట్ర నాయకులకు ప్రియాంక సూచించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu