సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. శిశువు మృతి, మహిళ పరిస్థితి విషమం.. వైద్యులపై బంధువుల ఆగ్రహం..

By Sumanth Kanukula  |  First Published Apr 22, 2023, 9:40 AM IST

సంగారెడ్డి ప్రభుత్వ  ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సరైన చికిత్స అందకపోవడంతో ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండగా.. శిశువు మృతి చెందింది.


సంగారెడ్డి ప్రభుత్వ  ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సరైన చికిత్స అందకపోవడంతో ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండగా.. శిశువు మృతి చెందింది. వివరాలు.. రేణుక అనే మహిళ ప్రసవం కోసం ఈ నెల 20వ తేదీన పురిటినొప్పులతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అయితే  ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుందని సిజేరియన్ చేయలేదు. 24 గంటలైనా డెలివరీ కాకపోవడంతో వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే శిశువు  అప్పటికే మృతిచెందింది. మరోవైపు రేణుక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని  రేణుక బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత  పరిస్థితులు నెలకొన్నాయి. 

Latest Videos

click me!