ముందు మీరు ఆచ‌రించండి.. మ‌హిళ బిల్లు లేఖ‌పై క‌విత‌కు బీజేపీ కౌంట‌ర్

By Mahesh Rajamoni  |  First Published Sep 6, 2023, 12:05 PM IST

Hyderabad: జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని అన్ని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిస్తూ లేఖ రాశారు. దీనిపై స్పందించిన బీజేపీ మీరు చెప్పేముందు ఆచ‌రించండి అని కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మహిళల కోటా బిల్లును టికెట్ల పంపిణీలో అనుసరించిన తర్వాతే మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు  ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ జీ కిషన్ రెడ్డి అన్నారు.
 


BJP reacts to Kavitha’s letter: చాలా కాలం నుంచి పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు క‌ల్పించాల‌నే డిమాండ్ ఉంది. ఇదే విష‌యంపై గ‌త కొంత కాలంగా  బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత గ‌ళ‌మెత్తుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఏర్పాటు చేయ‌బోయే పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును తీసుకువ‌చ్చి ఆమోదం తెల‌పాల‌ని కోరుతూ ఆమె దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు లేఖ రాశారు. క‌విత లేఖ‌పై స్పందించిన బీజేపీ..  మీరు చెప్పేముందు ఆచ‌రించండి అని కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మహిళల కోటా బిల్లును టికెట్ల పంపిణీలో అనుసరించిన తర్వాతే మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు  ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ జీ కిషన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ టిక్కెట్ల పంపిణీలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని అధికార బీఆర్‌ఎస్ లేవనెత్తాని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మహిళా కోటా బిల్లు ఆమోదంపై  అన్ని రాజకీయ పార్టీల నేతలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కే కవిత రాసిన లేఖపై కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. "ఏ లేఖ రాయాల్సిన అవసరం లేదు. టిక్కెట్ల పంపిణీలో (రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం) దానిని అనుసరించిన తర్వాత మాత్రమే ఈ విషయంపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు ఉంటుంద‌ని" అన్నారు.

Latest Videos

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏకం చేసి ఆమోదించాలని కోరుతూ బీజేపీ, కాంగ్రెస్ సహా 47 రాజకీయ పార్టీల అధినేతలకు కవిత లేఖ రాశారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం బీఆర్ఎస్ మొదటి జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. ఇదే విష‌యాన్ని ఎత్తిచూపుతూ కిష‌న్ రెడ్డి బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు సెప్టెంబర్ 17న “తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం”గా జరుపుకునే కార్యక్రమాల గురించి అడిగిన ప్రశ్నకు.. ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడంపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాతనే, రాష్ట్ర ప్రభుత్వం-కొన్ని ఇతర రాజకీయ పార్టీలు కేవలం ఫార్మాలిటీ కోసం ఆ రోజు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయ‌ని తెలిపారు.

నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17, 1948న ఇండియన్ యూనియన్‌లో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిందని కిష‌న్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి పాఠశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన అన్నారు.  కాగా, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌కు సమీపంలో కాంగ్రెస్ 'మెగా ర్యాలీ' నిర్వహిస్తుందనీ, అక్కడ తెలంగాణకు ఐదు హామీలను ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే, సెప్టెంబర్ 17న “జాతీయ సమైక్యతా దినోత్సవం” సందర్భంగా బైక్ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఎంఐఎం ప్రకటించింది.

click me!