వరంగల్: విద్యుత్ సరఫరాలో అంతరాయం వరంగల్ ఎంజీఎంలో రోగి మృతి చెందాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ పై ఉన్న రోగి మరణించినట్టుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణంగా వారు చెబుతున్నారు.

కరోనా సోకడంతో చికిత్స కోసం గాంధీ అనే వ్యక్తి గత నెలాఖరులో ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా మారింది. దీంతో డాక్టర్లు ఆయనను వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నారు.
అయితే శనివారం నాడు ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటికే గాంధీ వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా వెంటిలేటర్ పనిచేయక ఆయన మరణించాడు.
ఎంజీఎంలో జనరేటర్లు ఉన్నాయి. అయితే మరో వెంటిలేటర్ కు గాంధీని మార్చే సమయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగానే మరణించినట్టుగా చెప్పారు. ఈ విషయంలో తమ నిర్లక్ష్యం లేదని ఆయన చెప్పారు.
అయితే ఈ వాదనతో మృతుల బంధువులు, కుటుంబసభ్యులు ఏకీభవించడం లేదు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.