Munugode Bypoll 2022: ‘‘13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి’’.. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

By Sumanth KanukulaFirst Published Aug 13, 2022, 9:22 AM IST
Highlights

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరుతున్న రాజగోపాల్‌ రెడ్డిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్స్‌లో.. ‘‘రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే.. అమిత్ షాను బేరామడిని నీచుడివి అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. మునుగోడు నిన్ను క్షమించేది లేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తన రాజీనామాతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడారు. తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవగానే సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న గట్టుప్పల్ ను మండలంగా ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో అక్కడే సమస్యల పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తాను చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న  పరిణామాలను చూస్తే అర్ధం అవుతుందన్నారు. తాను రాజీనామా ప్రకటించడంతో చేనేత కార్మికులకు కూడా పెన్షన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.  తన రాజీనామాతో మునుగోడుతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేస్తుందన్నారు. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని తాను పలు దఫాలుగా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను రాజీనామా సమర్పించగానే నియోజకవర్గం మొత్తం రోడ్ల పనులు ప్రారంభమైన విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.మూడున్నర ఏళ్లుగా ఎన్ని నిిధులు ఇచ్చారో ఈ నెల 20న జరిగే సభలో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికే కేసీఆర్ తో జరుగుతున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు.

click me!