హైదరాబాద్ వజ్రాభరణాలు చోరీ.. భూతద్దం దొంగలను పట్టించింది.. ఎలాగంటే...

By SumaBala BukkaFirst Published Dec 24, 2022, 12:23 PM IST
Highlights

బంజారాహిల్స్ లో కలకలం సృష్టించిన గోల్డ్ అండ్ డైమండ్ నగల దొంగతనం కేసులో ఓ భూతద్దం దొంగలను పట్టించింది. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో వజ్రాభరణాల దొంగతనం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఫిలింనగర్ ఫేజ్-2లో ఈ ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. శమంతక డైమండ్స్ షోరూంలో ఈ భారీ చోరీ జరిగింది. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు భారీ వేట కొనసాగించారు. ఎట్టకేలకు రెండు రోజుల తరువాత నిందితులను గుర్తించారు. వీరిలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ చోరీకి పాల్పడిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే కేసులో నిందితులను పట్టించిన తీరు విస్మయపరుస్తోంది. డైమండ్స్ నాణ్యతను పరిశీలించడానికి వాడే భూతద్దం దొంగలను పట్టించింది. అదే ఈ కేసులో విశేషం.. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈ షో రూం. మాజీ మంత్రి చెంచురామయ్య మనవడు పవన్ కుమార్ ది. అతనికి ఫిలింనగర్ లో శమంతక డైమండ్స్ పేరుతో షోరూం ఉంది. ఈ నెల 20వ తేదీగన చింతల్ బస్తీకి చెందిన మచ్చ అలియాస్ అంజి.. మైలారం పవన్ కుమార్ లు చోరీకి పాల్పడ్డారు. వీరు నెంబర్ ప్లేట్ లేని బైక్ మీద వచ్చి షోరూం కిటీకి అద్దాలు తీసి దొంగతనానికి పాల్పడ్డారు. కోటి విలువైన ఆభరణాలతో పారిపోయారు. 

బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. రూ. కోటి విలువైన వజ్రాలు, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..

తరువాత దొంగతనం విషయం తెలిసిన యజమానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే విచిత్రం ఏంటంటే.. వీరు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న సమయంలో నిందితుల్లో ఒకరు పోలీసుల ఎదుటే ఉన్నాడు. సెల్ ఫోన్ స్నాచింగ్ కేసులో అతడిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. 

బంజారాహిల్స్ లో దొంగతనానికి ముందు ఈ నెల 19న అంజి, పవన్ కుమార్ లు సింగాడికుంటలో తమ ఇంటి పక్కింట్లో మరో దొంగతనం చేశారు. రెండు సెల్ ఫోన్లు, రూ.5వేలు డబ్బు దొంగిలించారు. ఆ రాత్రే వజ్రాభరణాల దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే సెల్ పోన్ పోయిన బాధితుడు నిందితుల కోసం సీసీ ఫుటేజీని పరిశీలిస్తే పక్కింట్లోని పవన్ కుమారే దొంగతనం చేసినట్లు తెలిసింది. దీంతో పవన్ కు ఫోన్ చేసి అడిగితే రెండు పోన్లు పంపించాడు. నగదు కావాలంటే మాత్రం ఇవ్వలేదు. 

దీంతో సదరువ్యక్తి తన స్నేహితులతో కలిసి పవన్ ను జహీరాబాద్ చౌరస్తాలో కలిసి నిలదీశారు. దీంతో వాగ్వాదం జరిగింది. డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు నెంబర్ ప్లేట్ లేని స్కూటర్ తో పాటు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సెల్ ఫోన్ గురించి అడుగుతుంటే.. అతని జేబులో ఇంకేవో వస్తువులున్నట్టు గుర్తించారు. వాటిని తీసి టేబుల్ మీద పెట్టడా.. అందులో భూతద్దం కనిపించింది. అది డైమండ్స్ ను పరీక్షించే భూతద్దం.. అదే సమయంలో అక్కడే ఉన్న షోరూం యజమాని పవన్ కుమార్.. ఆ భూతద్దాన్ని చూసి అది తమ షోరూంలోదేనని గుర్తించాడు. దీంతో అసలు విషయం బయటపడి నిందితులు పట్టుబడ్డారు. 

click me!