బాలకృష్ణ పవర్ ఫుల్ అయితే...: పోసాని సంచలన వ్యాఖ్యలు

Published : Dec 12, 2018, 11:09 AM IST
బాలకృష్ణ పవర్ ఫుల్ అయితే...: పోసాని సంచలన వ్యాఖ్యలు

సారాంశం

బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు సైంధవుడయితే సైంధవుడు-2గా లగడపాటి రాజగోపాల్‌ వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అంత పవర్ ఫుల్ అయి ఉంటే కూకట్ పల్లిలో సుహాసిని గెలిచి ఉండేవారని ఆయన అన్నారు. 

లగడపాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమని ఆయన అన్నారు.  ఆంధ్రాలో ఉన్న కమ్మవారు మంచి నిజాయితీ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు సైంధవుడయితే సైంధవుడు-2గా లగడపాటి రాజగోపాల్‌ వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అయినా కేసీఆర్‌ చేసినా సంక్షేమమే కేసిఆర్ ను గెలిపించిందని అన్నారు.

 ప్రజాస్వామ్యం వైపు ఉండే గద్దర్‌.. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున రావడం చూసి షాకయ్యానని వ్యాఖ్యాననించారు.. కేసీఆర్‌ను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్‌ ఏం చెప్పాడో ఆ మంచి పనులను చేశారని అయన అన్నారు.

 కాళేశ్వరం పూర్తైతే సగం తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి, మూడేళ్లలో ప్రజలకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆరే అని ఆయన అన్నారు. ఏపీలో తహసీల్దార్‌పై దాడి జరిగితే చంద్రబాబు పట్టించుకోలేదని, అదే కేసీఆర్‌ అనాథ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేశారని ఆయన కొనియాడారు.

జగన్‌పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు పరామర్శించలేదని ఆయన అన్నారు. కనీసం పలకరించలేదు కదా.. జగన్‌ కుటుంబంపై ఎదురు దాడి చేశారని విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల్లో సీఎం ఎవరైనా మంచి పాలన అందిస్తారని చెప్పారు. ఎపిలో కేసిఆర్ జగన్ కు మద్దతుగా నిలిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్త

గ్రేట్ ఎన్టీఆర్ నే చంద్రబాబు చంపాడు.. కేసీఆర్ విజయంపై పోసాని కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే