గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మాజీమంత్రి పొన్నాల బంధువు దుర్మరణం

Published : Aug 12, 2019, 09:42 PM ISTUpdated : Aug 13, 2019, 07:07 AM IST
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మాజీమంత్రి పొన్నాల బంధువు దుర్మరణం

సారాంశం

22ఏళ్ల కోడూరి ధృపత్ బైక్ పై వెళ్తుండగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ తలకు బలంగా ఢీ కొట్టడంతో ధృపత్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధృపత్ ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 

హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు కోడూరి ధృపత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. 

వివరాల్లోకి వెళ్తే 22ఏళ్ల కోడూరి ధృపత్ బైక్ పై వెళ్తుండగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ తలకు బలంగా ఢీ కొట్టడంతో ధృపత్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధృపత్ ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 

ప్రమాదవిషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి