ఖమ్మం : జనగర్జన సభ.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Siva Kodati |  
Published : Jul 02, 2023, 06:15 PM ISTUpdated : Jul 02, 2023, 09:52 PM IST
ఖమ్మం : జనగర్జన సభ.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సారాంశం

ఖమ్మంలో జరుగుతున్న జనగర్జన సభకు చేరుకున్న రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం పొంగులేటి అనుచరులు, పలు పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు.  

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నగరంలో జరుగుతున్న జనగర్జన సభకు చేరుకున్న రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. అనంతరం పొంగులేటి అనుచరులు, పలు పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. 

అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన హెలికాఫ్టర్‌లో బయల్దేరి ఖమ్మం సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదిరత నేతలు రాహుల్‌కు స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధ నౌక రాహుల్‌ను ముద్దాడారు. ఆపై తన సుదీర్ఘ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను పూర్తి చేసుకుని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేదికపైకి చేరుకుని రాహుల్‌తో కరచాలనం చేశారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme