రఘునందన్ vs కొత్త ప్రభాకర్ రెడ్డి: రైతు వేదికపై మాటల యుద్ధం

Siva Kodati |  
Published : Feb 23, 2021, 07:44 PM IST
రఘునందన్ vs కొత్త ప్రభాకర్ రెడ్డి: రైతు వేదికపై మాటల యుద్ధం

సారాంశం

మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతు వేదిక రాజకీయ వేదికగా మారింది. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్, మెదక్ టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది

మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతు వేదిక రాజకీయ వేదికగా మారింది. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్, మెదక్ టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఉచిత విద్యుత్ మా ఘనతేనన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను రఘనందన్ తప్పు పట్టారు. రైతు వేదికలను రాజకీయ వేదికలుగా మార్చొద్దని రఘునందన్ సూచించారు.

రైతులను రాజులను చేస్తున్నది ప్రధాని మోడీయేనని ఆయన చెప్పారు. అయితే రఘునందన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఉందా అని ఎంపీ ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలంటూ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?