ఇంటి ముందు కుక్క మూత్రం పోసిందని.. యజమాని తల పగులగొట్టారు...

sivanagaprasad kodati |  
Published : Jan 01, 2019, 08:18 AM IST
ఇంటి ముందు కుక్క మూత్రం పోసిందని.. యజమాని తల పగులగొట్టారు...

సారాంశం

తన ఇంటి ముందు కుక్క మూత్రం పోసిందనే ఆవేశంలో ఓ వ్యక్తి దాని యజమాని తలను పగులగొట్టాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎల్బీ నగర్ శివగంగానగర్‌‌కు చెందిన దాసరి అంజయ్యకు చెందిన పెంపుడు కుక్కకు కొద్దిరోజుల క్రిత జబ్బు చేసింది. 

దీంతో డిసెంబర్ 29న దానిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోను పిలిచాడు. ఆటోలో ఉన్న మట్టిని డ్రైవర్ దులుపుతుండగా... ఆ కుక్క పక్కనే ఉన్న స్థలంలో మూత్ర విసర్జన చేసింది. దానికి ఎదురుగా నివసిస్తున్న రాములు అనే వ్యక్తి దీనిని గమనించి గట్టిగా అరుస్తూ బయటకి వచ్చాడు.

తన ఇంటి ముందు కుక్కతో ఇలా చేయిస్తావా అంటూ అంజయ్యను అసభ్యపదజాలంతో దూషించాడు. కోపంతో చేతిలో ఉన్న హెల్మెట్‌తో అతని తలపై గట్టిగా బాదాడు. అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ పోలీసులు రాములుపై ఐపీసీ 324, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?