బీటెక్ విద్యార్ధిని దుర్మరణం: గో కార్టింగ్ ప్లేజోన్‌ సీజ్, ముగ్గురి అరెస్ట్

Siva Kodati |  
Published : Oct 09, 2020, 08:08 PM ISTUpdated : Oct 09, 2020, 08:21 PM IST
బీటెక్ విద్యార్ధిని దుర్మరణం: గో కార్టింగ్ ప్లేజోన్‌ సీజ్, ముగ్గురి అరెస్ట్

సారాంశం

గుర్రంగూడ గో కార్టింగ్ ప్లేజోన్‌లో బీటెక్ విద్యార్ధిని శ్రీ వర్షిణి దుర్మరణం పాలైన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రమాదం జరిగిన గో కార్టింగ్ ప్లే జోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

గుర్రంగూడ గో కార్టింగ్ ప్లేజోన్‌లో బీటెక్ విద్యార్ధిని శ్రీ వర్షిణి దుర్మరణం పాలైన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రమాదం జరిగిన గో కార్టింగ్ ప్లే జోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, మీర్‌పేటకు చెందిన శ్రీ వర్షిని మరో యువకుడు తో కలిసి గో కార్టింగ్‌కి వెళ్లారు. ఈ నేపథ్యంలో కారును తీసుకొని ట్రాక్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది.

టైర్‌కు శ్రీ వర్షిణి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తల బలంగా నేలకు తగిలింది,  ఆమె పెట్టుకున్నహెల్మెట్‌ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైంది. 

అయితే అర్ధరాత్రి సమయంలో గో కార్టింగ్‌కు అనుమతి ఇవ్వడం పైన శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్