shilpa chowdary Case: శిల్పా చౌదరి ఇంట్లో పోలీసుల సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

By Siva Kodati  |  First Published Dec 4, 2021, 3:31 PM IST

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను వందల కోట్ల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి ఇంట్లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు


కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను వందల కోట్ల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి ఇంట్లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు . మరోవైపు shilpa chowdary.. పోలీసు విచారణలో తన డాబూ, దర్పాన్ని ప్రదర్శించారు. పలు సందర్బాల్లో కంటతడి పెట్టారని తెలిసింది. న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు ఆమెను చంచల్ గూడ మహిళా జైలు నుంచి నార్సింగ్ లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ వోటీ) కార్యాలయానికి తరలించారు. 

Also Read:బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకే, వారంతా అందుకే ఇలా.. కీలక విషయాలు చెప్పిన శిల్పా చౌదరి

Latest Videos

undefined

అక్కడ దర్యాప్తు అధికారులు, నార్సింగ్ ఇన్ స్పెక్టర్, అదనపు ఇన్స్ పెక్టర్ మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు. తొలుత పోలీసులు మోసాల చిట్టాపై ప్రశ్నించగా.. శిల్ప విలపిస్తూ... ‘నాకేం తెలియదు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. దాంతో పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు evidenceను ముందు పెట్టారు. కాలే డేటా రికార్డులను.. ఎవరితో ఎప్పుడు? ఎంతసేపు మాట్లాడారనే చిట్టాను తీశారు. దీంతో ఆమె ఒక్కో విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనది మెదక్ జిల్లా అని, ఓ బాబు ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. బాధితుల వివరాలను పోలీసులు చెబుతూ.. ‘ఇంకా చెప్పమంటారా? మీరే చెబుతారా? అని ప్రశ్నించడంతో.. ఆమె అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పారని తెలిసింది. 

కాగా,  శిల్పా చౌదరికి గురువారం న్యాయస్థానం షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే శిల్పా చౌదరి  భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం శిల్పా చౌదరిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ. కోట్లు కాజేసిన shilpa chowdary మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. Divanos పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు.  ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలు ఉన్నారని గుర్తించారు. 

click me!