దివ్య హత్య కేసు: పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు

Published : Feb 19, 2020, 01:40 PM ISTUpdated : Feb 19, 2020, 04:20 PM IST
దివ్య హత్య కేసు: పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు

సారాంశం

దివ్య హత్య కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. వెంకటేష్ గౌడ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


గజ్వేల్:గజ్వేల్ పట్టణంలో బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో దివ్యను వేధించిన వెంకటేష్‌ గౌడ్‌‌ను పోలీసులు అనుమానిస్తున్నారు.  వెంకటేష్‌గౌడ్‌ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విచారణ కోసం వారిని గజ్వేల్‌కు తరలించారు పోలీసులు.

ఈ నెల 18వ తేదీ రాత్రి గజ్వేల్ పట్టణంలో బ్యాంకు ఉద్యోగి దివ్య తాను నివాసం ఉంటున్న రూములోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది. మరో వారం రోజుల్లో పెళ్లి ఉన్న సమయంలో  ఆమె హత్యకు గురి కావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన వెంకటేష్‌గౌడ్ గతంలో దివ్యను వేధించినట్టుగా కుటుంబసభ్యులు గుర్తు చేస్తున్నారు. వేములవాడలో ఉంటున్న వెంకటేష్‌ గౌడ్‌ తండ్రి పరశురాములు, తల్లి మల్లీశ్వరీని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వేములవాడ నుండి వారిని గజ్వేల్‌కు తీసుకొచ్చారు.

వెంకటేష్ గౌడ్ కోసం  ఐదు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వెంకటేష్ గౌడ్ ఫోన్ కూడ స్విచ్ఛాప్ ఉంది. కొడుకు గురించి తల్లిదండ్రుల నుండి సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్