సైదాబాద్ చిన్నారి రేప్, హత్య: ఆటోలో చోరీకి నిందితుడు రాజు యత్నం

Published : Sep 20, 2021, 07:52 AM ISTUpdated : Sep 20, 2021, 08:00 AM IST
సైదాబాద్ చిన్నారి రేప్, హత్య: ఆటోలో చోరీకి నిందితుడు రాజు యత్నం

సారాంశం

అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఎల్బీ నగర్‌ వరకు తనతోనే  వచ్చాడని టాస్క్‌ఫోర్‌ పోలీసులకు అతడు చెప్పినట్లు సమాచారం

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఇటీవల ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. అనంతరం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాజు ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  కాగా.. తాజాగా.. రాజు గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

హత్యాచారం చేసిన అనంతరం చిన్నారి మృతదేహాన్ని బొంతలో చుట్టి, తన గుడిసెకు తీసుకెళ్లి తాళం వేసి బయటకు వెళ్లాడు. తర్వాత తన స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. తిరిగి ఇంటికొచ్చే క్రమంలో అప్పటికే కాలనీలో చిన్నారి అదృశ్యమైన ఘటన వెలుగులోకి రావడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఎల్బీ నగర్‌కు వెళ్లాడు. అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఎల్బీ నగర్‌ వరకు తనతోనే  వచ్చాడని టాస్క్‌ఫోర్‌ పోలీసులకు అతడు చెప్పినట్లు సమాచారం. నిందితుడు ఎల్బీ నగర్‌కు చేరుకున్న తర్వాత అక్కడ రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న ఆటోను చోరీ చేయడానికి ప్రయత్నించాడు.

అంతలోనే ఆ ఆటోడ్రైవర్‌ అక్కడకు చేరుకోవడంతో మద్యం మత్తులో ఉన్న రాజు.. అతనితో వాగ్వాదానికి దిగాడు. అక్కడి నుంచి సిటీ బస్సు ఎక్కి నాగోల్‌లో దిగినట్లు పోలీసులకు సీసీటీవీ ఫుటేజీలు లభించాయి. అక్కడ మరోసారి మద్యం తాగి సిటీ బస్సులో ఉప్పల్‌ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్‌కేసర్‌ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘట్‌కేసర్‌లో నిందితుడు మోత్కూరు బస్సెక్కి వలిగొండకు వెళ్లాడు. వలిగొండ నుంచి చిట్యాల మీదుగా నల్లగొండ చేరుకున్నాడు. నల్లగొండ మీదుగా అరెగుడం పంతంగి నుంచి రెడ్డిబావి సమీపంలో కాలినడకన వెళ్లిన్నట్లు ఆనవాళ్లు లభించినట్లు తెలిసింది. రాజు స్నేహితుడు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu