పొద్దునంతా డ్రైవర్ వేషం.. చీకటి పడితే చాలు...

Bukka Sumabala   | Asianet News
Published : Nov 06, 2020, 10:32 AM IST
పొద్దునంతా డ్రైవర్ వేషం.. చీకటి పడితే చాలు...

సారాంశం

తలుపుకు వేసిన తాళాలు విరగ్గొట్టి ఇళ్లలో వరస చోరీలకు పాల్పడుతున్న ఘరానా గ్యాంగ్‌లో ఇద్దరిని ఈస్ట్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పగలంతా కారు నడుపుతూ, రాత్రివేళ దొంగతనాలు చేస్తున్నారని విచారణలో తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. 

తలుపుకు వేసిన తాళాలు విరగ్గొట్టి ఇళ్లలో వరస చోరీలకు పాల్పడుతున్న ఘరానా గ్యాంగ్‌లో ఇద్దరిని ఈస్ట్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పగలంతా కారు నడుపుతూ, రాత్రివేళ దొంగతనాలు చేస్తున్నారని విచారణలో తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు.  

వారి నుంచి రూ. 18.75 లక్షల విలువ చేసే 35 తులాల బంగారు నగలు, రూ. 1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 

రంగారెడ్డి జిల్లా, ఆమన్‌గల్‌ ప్రాంతానికి చెందిన నేనావత్‌ వినోద్‌ కుమార్‌ అలియాస్‌ అఖిలేష్ కుమార్‌ (25) బాలాపూర్‌లో ఉంటున్నాడు. ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో బీటెక్‌ చదువున్న వినోద్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.  చదువు మానేసి ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నా డు. అందుకే 2014 నుంచి చోరీలబాట పట్టాడు. 

పగలు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ, రాత్రిపూట ఇళ్లలో చోరీలు చేస్తున్నాడు. ఇతడిపై 42 కేసులు నమోదయ్యాయి. 2015, 2019లో హైదరాబాద్‌ పోలీసులు, 2017లో రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. పలుమార్లు జైలుకెళ్లాడు. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. 

10 నెలల వ్యవధిలో ముఠా సభ్యులతో కలిసి 8 చోరీలకు పాల్పడ్డాడు. చోరీల్లో తనతోపాటు రంగారెడ్డి జిల్లా బాలానగర్‌ కు చెందిన కత్రావత్‌ రాజేశ్‌ (25), మొగల్‌పురాకు చెందిన షకీల్‌ను భాగాస్వామ్యులుగా చేర్చుకున్నా డు. 

వినోద్‌, రాజేశ్‌ పోలీసులకు పట్టుబడగా షకీల్‌ పరారీలో ఉన్నా డు. ఇతడు గతంలో వ్యభిచారం కేసులో నిందితుడు. వీరిపై చార్మినార్‌లో-1, ఆదిభట్లలో -2, మీర్‌పేట్‌లో-3, ఎల్‌బీనగర్‌లో-1, బాలాపూర్‌లో ఓ కేసు నమోదైంది. విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును చార్మినార్‌ పోలీసులకు అప్పగించారు.
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu