వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద వరద నీటిలో చిక్కుకుంది. ఈ బస్సులో పెళ్లి బృందం ఉంది. వెంటనే వారంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకుని బస్సులోని వారిని బయటకు తీసుకు వచ్చారు.
వికారాబాద్: Vikarabad జిల్లాలోని Mominpet రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సులో నుండి పలువురిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు పోలీసులు. వరద నీటిలో చిక్కుకున్న Private Bus ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.ఈ సమయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది.
Flood నీటిలోనే బస్సు మునిగిపోయింది. ఈ విషయాన్ని Bus లో ఉన్న ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ROB వద్దకు చేరుకొని బస్సులో ఉన్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీశారు.సోమవారం నాడు కురిసిన Heavy Rainsతో ఆర్‌ఓబీ కింద వరద నీరు పోటెత్తింది.
undefined
అయితే వరద నీటిని సరిగా అంచనా వేయని బస్సు డ్రైవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింది నుండి బస్సును ముందుకు పోనిచ్చాడు. అయితే వరద నీటిలో బస్సు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని ప్రయాణీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో పోలీసులు బస్సులోని ప్రయాణీకులను బయటకు తీశారు.
జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సేక్ పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహదీపట్నం, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సోమాజిగూడ, కొండాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, బోయిన్పల్లి, ఆల్వాల్, మారేడ్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, భార్కస్ , యాకుత్పురా, బహదూర్ పురా, చేవెళ్ల, నాగారం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో జిహెచ్ఎంసి డిఆర్ఎస్ బృందాలను అప్రమత్తం చేసింది.
హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఆదివారం నాడు మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలోని దిల్ షుక్ నగర్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, బోయిన్ పల్లి , మారేడ్పల్లి, బేగంపేట్, అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, కూకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్, అమీర్పేట్ లో వర్షం కురిసింది,
also read:హైద్రాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీరు, వాహనదారుల ఇక్కట్లు
నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే వర్షాలను తీసుకువచ్చాయి. ఈనెల 15న రాత్రి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. 14న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కానీ, వర్షపాతం నమోదు కాలేదు.ఈ నెల 17న ఉదయం నుండి వర్షం ప్రారంభమైంది. గంటకు పైగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని పాతబస్తీలోని ఛత్రినాక, shiva ganga nagar, శివాజీ నగర్ లో వరద నీరు రోడ్లపై పొంగి పొర్లింది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండలో కూడా వర్షం నీరు రోడ్లపై చేరడంతోట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. సింగపూర్ టౌన్షిప్ దగ్గర 5.6 సెం.మీ వర్షం నమోదయింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కింది గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.