New Year 2022 : శంషాబాద్‌లో ఫాంహౌస్‌పై పోలీసుల దాడులు, స్పెషల్ డ్రైవ్‌లో 92 కేసులు నమోదు

Siva Kodati |  
Published : Jan 01, 2022, 03:00 PM ISTUpdated : Jan 01, 2022, 03:03 PM IST
New Year 2022 : శంషాబాద్‌లో ఫాంహౌస్‌పై పోలీసుల దాడులు, స్పెషల్ డ్రైవ్‌లో 92 కేసులు నమోదు

సారాంశం

రంగారెడ్డి జిల్లా (ranga reddy district) శంషాబాద్ (shamshabad) పోలీసు‌స్టేషన్ పరిధిలోని పోశేట్టిగుడా వద్ద వున్న ఫాంహౌస్‌పై నిన్న రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఫాంహౌస్‌లో మద్యం, హుక్కా తాగుతున్న యువకులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా (ranga reddy district) శంషాబాద్ (shamshabad) పోలీసు‌స్టేషన్ పరిధిలోని పోశేట్టిగుడా వద్ద వున్న ఫాంహౌస్‌పై నిన్న రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఫాంహౌస్‌లో మద్యం, హుక్కా తాగుతున్న యువకులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. పది హుక్కా బాటిల్స్ సీజ్ చేయడంతో పాటు…. ఏరో స్పేస్ హోటల్‌లో అనుమతిలేని సౌండ్ సిస్టమ్ (డిజే) సీజ్ చేశారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాత్రి శంషాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా 92 కేసులు నమోదు చేసినట్లు శంషాబాద్ డిసీపీ తెలిపారు.

కాగా…. న్యూఇయర్ వేడుకల సమయంలో హైదరాబాద్‌లోని (hyderabad police) మూడు కమిషనరేట్‌ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు.. హైదరాబాద్ పోలిస్ కమీషనర్ రేట్ పరిధిలో 1258 కేసులు, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 1528 కేసులు నమోదయ్యాయి. 

కాగా.. new yearకి నగరం సంబరంగా స్వాగతం పలికింది. అయితే మరోవైపు పోలీసులు నగరంలో drunk and drive తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు. 40 బైకులు, ఏడు కార్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. 92 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఓ woman హల్ చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు అర్ధరాత్రి సమయంలో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also Read:మందుబాబులకి మరొకరు బలి... పీకలదాకా తాగి సైకిలిస్ట్‌ను కారుతో ఢీ, నిందితుడు ఎయిర్‌లైన్స్ ఉద్యోగి

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులను కట్టడి చేయడానికి పోలీసులు నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3,146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ కమిషనరేట్లో 1,258, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,528. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. ఈ కమిషనరేట్ల పరిధిలో 265 బృందాలతో పోలీసులు తనిఖీలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు