వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు

Published : Nov 27, 2018, 07:29 AM ISTUpdated : Nov 27, 2018, 07:39 AM IST
వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసుల  సోదాలు

సారాంశం

గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు సోదాలు జరిపారు. 

గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ కొంపల్లిలోని ఆయన కుమారుడు విజయ్‌రెడ్డి ఇంటికి వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఇంట్లో భారీ ఎత్తున నగదు, మద్యం నిల్వలు ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిందని... అధికారుల ఆదేశాల మేరకు ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు.

నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ ఆస్తులపై ఆయన మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. ఆ మరుసటి రోజే ఆయన ఇంట్లో సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

"

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీ, తెలంగాణలో వర్షబీభత్సమే | Asianet News Telugu
Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీలో కాదు తెలంగాణలోనూ వర్షబీభత్సమే, ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే