అదే జరిగితే గాంధీభవన్ లో అడుగుపెట్టను:పీసీసీ చీఫ్ ఉత్తమ్

Published : Nov 26, 2018, 10:09 PM IST
అదే జరిగితే గాంధీభవన్ లో అడుగుపెట్టను:పీసీసీ చీఫ్ ఉత్తమ్

సారాంశం

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓడిపోతే తాను గాంధీభవన్ లో అడుగుపెట్టబోనని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలకు పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి లేదా కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా తనదే పూర్తి బాధ్యత అన్నారు.   

హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓడిపోతే తాను గాంధీభవన్ లో అడుగుపెట్టబోనని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలకు పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి లేదా కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా తనదే పూర్తి బాధ్యత అన్నారు. 

ఒకవేళ ప్రజాఫ్రంట్ ఓడిపోతే డిసెంబర్11 తర్వాత తాను గాంధీభవన్ లో అడుగుపెట్టేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాఫ్రంట్ గెలిచి తీరుతుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. 

ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలక ప్రకటన కూడా చేశారు. ముందస్తు ఎన్నికల్లో గెలిచే వరకు తాను గెడ్డం తీసేది లేదని ప్రతిన బూనారు.  ఈ నేపథ్యంలో ఆయను గెడ్డం తియ్యకుండా ఉన్నారు. డిసెంబర్ 11 తర్వాత ప్రజాఫ్రంట్ విజయంతోనే గెడ్డం గీస్తానని శపథం చేశారు. తాజాగా పార్టీ ఓడిపోతే గాంధీభవన్ కు రానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?