ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్‌కి షాక్.. భైంసాలో పాదయాత్రకు నో పర్మిషన్

By Siva KodatiFirst Published Nov 27, 2022, 7:21 PM IST
Highlights

రేపటి నుంచి జరగనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి పోలీసులు షాకిచ్చారు. సోమవారం భైంసాలో జరగనున్న బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పోలీసులు షాకిచ్చారు. రేపటి నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర సాగుతుందని బీజేపీ శ్రేణులు తేల్చిచెబుతున్నాయి. 

కాగా... ఐదో  విడత  ప్రజా సంగ్రామ యాత్ర  ఈ నెల 28వ తేదీ నుండి  బైంసా  నుండి  ప్రారంభం అవుతుందని తెలంగాణ బీజేపీ వర్గాలు ప్రకటించాయి.  ఈ  పాదయాత్రను ప్రారంభ సూచికంగా  నిర్వహించే  సభలో  మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్  పాల్గొంటారు. 20 రోజుల పాటు  222  కి.మీ  పాటు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించనున్నారు . ఐదు  జిల్లాలు, మూడు  పార్లమెంట్  నియోజకవర్గాలు , ఎనిమిది  అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే  నెల  17వ  తేదీ వరకు  యాత్ర  సాగనుంది. 

ఈ  నెల  28న ఉదయం నిర్మల్ జిల్లా  ఆడెల్లి  పోచమ్మ అమ్మవారి  ఆలయంలో  బండి  సంజయ్  ప్రత్యేక  పూజలు నిర్వహించిన  తర్వాత  బైంసాకు  వెళ్తారు. రేపు  6.4 కి.మీ బండి సంజయ్  పాదయాత్ర  నిర్వహిస్తారు.  సోమవారం సాయంత్రం గుండగామ్  వద్ద  బండి  సంజయ్  బస  చేస్తారు. 

ALso Read:అడ్డంగా సంపాదిస్తుంటే సోదాలు చేయొద్దా : మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై బండి సంజయ్

ఈనెల 29న రెండోరోజు పాదయాత్ర గుండగామ్ నుండి మహాగాన్, చటా మీదుగా లింబా వరకు సాగుతుంది. రెండోరోజు మొత్తం 13 కి.మీలపాటు  బండి  సంజయ్ నడుస్తారు. 3వ రోజు లింబా నుండి ప్రారంభమై కుంటాల, అంబకంటి మీదుగా  బూజుర్గుకు  చేరుకుంటారు  సంజయ్.  మొదటి మూడు రోజులు ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే  పాదయాత్ర కొనసాగనుంది.

డిసెంబర్ 1 నుండి 6వరకు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. 1న బామిని బూజుర్గ్ నుండి నందన్, నశీరాబాద్ మీదుగా రాంపూర్ వరకు  యాత్ర సాగుతుంది డిసెంబర్ 2న రాంపూర్ నుండి లోలమ్ మీదుగా చిట్యాల దాకా యాత్ర  సాగుతుంది. డిసెంబర్ 3న చిట్యాల నుండి  మంజులాపూర్, నిర్మల్ రోడ్, ఎడిగాం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తాపూర్ వరకు సాగుతుంది. 

డిసెంబర్ 4న లక్మణ్ చందా మండలంలోని వెల్మల, రాచాపూర్, లక్మణ్ చందా, పోటపల్లి వరకు  పాదయాత్ర సాగుతుంది. డిసెంబర్ 5న మమ్డా మండలంలోని కొరైకల్ మమ్డా, దిమ్మతుర్తి వరకు సంజయ్  పాదయాత్ర నిర్వహించనున్నారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. 6న దొమ్మతుర్తి,  ఇక్బాల్ పూర్, తిమ్మాపూర్, ఖానాపూర్ మీదుగా మస్కాపూర్ వరకు సాగుతుంది.  డిసెంబర్ 7న మస్కాపూర్ లోని సూరజ్ పూర్, బడాన్ ఖర్తి, ఓబులాపూర్, మొగల్ పేట మీదుగా కోరుట్ల నియోజకవర్గంలోని కోటి లింగేశ్వర స్వామి ఆలయం వద్ద  బండి  సంజయ్ బస  చేస్తారు. డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలోని  మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో మొత్తం 21.7 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు. డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం వెంకటాపురం, మోహన్ రావు పేట మీదుగా  వేములువాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో బస  చేస్తారు  బండి సంజయ్. 

డిసెంబర్ 11న మేడిపల్లి నుండి తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ మండల కేంద్రంలో రాత్రి బస చేస్తారు. డిసెంబర్ 12న జగిత్యాల పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుంది. డిసెంబర్ 13న తారకరామనగర్ నుండి చొప్పదండి నియోజకవర్గంలోని చిచ్చాయ్, మల్యాల చౌరస్తా, మల్యాల మీదుగా కొండగట్టుకు చేరుకుంటారు  బండి సంజయ్. డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుది. డిసెంబర్ 16 నుండి 17 వరకు కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తారు. చివరి రోజు కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ కళాశాల వద్ద పాదయాత్రను ముగిస్తారు. 
 

click me!