కరోనా సోకి.. గాంధీ ఆస్పత్రిలో పోలీసు అధికారి మృతి

Published : Feb 20, 2021, 10:10 AM ISTUpdated : Feb 20, 2021, 10:52 AM IST
కరోనా సోకి.. గాంధీ ఆస్పత్రిలో పోలీసు అధికారి మృతి

సారాంశం

ఒక ఏఎస్సై గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం మృతిచెందారు. సంగారెడ్డికి చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు (50) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 


దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పక్రియ మొదలైంది. రికార్డు స్థాయిలో కోటిమందికి ఇప్పటికే వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో  కరోనా మహమ్మారి విస్తరణ తగ్గుముఖం పడుతున్న సమయంలో తెలంగాణాలో పోలీసు అధికారి మరణం విషాదం నింపింది. కరోనాతో బాధపడుతున్న  ఒక ఏఎస్సై గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం మృతిచెందారు. సంగారెడ్డికి చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు (50) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 

ఏఎస్సై పోలీసు శిక్షణ కేంద్రంలో  ఎస్సై శిక్షణలో ఉన్నారు. బుధవారం అస్వస్థతకు గురైన ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షల సందర్భంగా  ఆయనకు కరోనాగా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు  చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం పరిస్థితి విషమించడంతో రాములు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?