దొంగ బాబా లీలలు.. అమాయకులను మోసం చేసి...

By telugu news teamFirst Published Feb 20, 2021, 8:51 AM IST
Highlights

ఇప్పటి వరకు మహారాష్ట్రలోని కోత్వాలి, గిట్టిఖదన్‌, పైఢోనీ పోలీ్‌సస్టేషన్లతో పాటు నగరంలో ఉప్పల్‌, మార్కెట్‌ పీఎస్‌లలో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి.

అతను ఓ సాధారణ వ్యక్తి. డబ్బు సంపాదించడానికి అక్రమ దారులను వెతికాడు. ఈ క్రమంలో బాబా అవతారం ఎత్తాడు. అమాయకులను మోసం చేసి డబ్బు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. కాగా.. సదరు బాబా అతని సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగపూర్‌ ప్రాంతానికి చెందిన సలీమ్‌ అలీ (60), మహమ్మద్‌ సాదిఖ్‌ (24), ఖుర్బాన్‌ అలీ (23)లతో పాటు మరో ఇద్దరు కలిసి ఓ ముఠాగా తయారయ్యారు. ఈ గ్యాంగుకు సలీం లీడర్‌. 1993 నుంచే నేరాల బాట పట్టిన సలీమ్‌ దృష్టి మరల్చి మోసాలకు పాల్పడటంలో నేర్పరి. తన బంధుమిత్రులను తన గ్యాంగులో చేర్చుకుని మోసాలు చేస్తుంటాడు. ఇప్పటి వరకు మహారాష్ట్రలోని కోత్వాలి, గిట్టిఖదన్‌, పైఢోనీ పోలీ్‌సస్టేషన్లతో పాటు నగరంలో ఉప్పల్‌, మార్కెట్‌ పీఎస్‌లలో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. ఈ గ్యాంగు సభ్యులు టార్గెట్‌ చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి అక్కడ వ్యాపార సముదాయాలకు దగ్గరలో, తక్కువ ఖర్చులో ఉండే లాడ్జిల్లో బస చేస్తుంటారు. 

అక్కడ బాబా అవతారమెత్తి అమాయకులను తమ బుట్టలోకి దించుతారు. సలీం బాబా వేషం వేసుకుని తన వద్ద శక్తి ఉందని నమ్మిస్తాడు. అతనితో పాటు ఉన్న మిగతా ఇద్దరు తాము కూడా సమస్యలతో వచ్చామని అక్కడి వారిని నమ్మిస్తారు. బాబా వద్దకు వచ్చే వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆయా సమస్యలను కోడ్‌ భాషలో బాబాకు తెలియజేస్తారు. బాబా తన వద్ద అతీంద్రీయ శక్తులున్నట్లు నటించి వారి సమస్యల గురించి ప్రస్తావించగానే బాధితులకు నమ్మకం పెరుగుతుంది. అదే ఆశతో వా రిని పూర్తిగా బుట్టలోకి దించడం.. బాబా ఆశీస్సులు తీసుకోవాలంటూ నమ్మిస్తూ వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను తీసుకుని పరారవుతుంటారు. సమాచారం మేరకు నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులు ముగ్గరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

click me!