నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి వెళ్తున్న సమయంలో పోలీసులు నాంపల్లి వద్ద అడ్డుకున్నారు.
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ తెలంగాణ భవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలను నాంపల్లి వద్ద పోలీసులు శుక్రవారంనాడు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై వ్యాఖ్యలను నిరసిస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిని నిరసిస్తూ తెలంగాణ భవన్ వద్దకు ర్యాలీగా వెళ్లిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పోలీస్ కమాండ్ కంట్రొల్ వద్ద హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను కలిసి బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసంపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారని నిన్న మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు.ఈ ఆరోపణలను నిరసిస్తూ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ దాడికి దిగాయి. అరవింద్ నివాసంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కారుపై దాడికి దిగారు. ఇంట్లోని దేవుడి విగ్రహలను కూడా విసిరికొట్టారని అరవింద్ ఆరోపిస్తున్నారు. తనకు ఎఐసీసీ సెక్రటరీ ఫోన్ చేస్తేనే కవిత మల్లికార్జునఖర్గేకు ఫోన్ చేసిన విషయం తెలిసిందన్నారు.
also read:దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ్, కుల అహంకారంతో దాడి: కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్
ఇదే విషయాన్ని తాను మీడియా సమావేశంలో చెప్పినట్టుగా అరవింద్ ఇవాళ మీడియాకు తెలిపారు. ఈ విషయమై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే ఇందులో వాస్తవం ఉందేమోనన్నారు. కవితను బీజేపీలో చేరాలని కూడా ఒత్తిడి వచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని అరవింద్ గుర్తు చేశారు.