వనమా రాఘవేందర్ రావు‌కి సహకరించిందెవరు?: పోలీస్ శాఖ అంతర్గత విచారణ

By narsimha lodeFirst Published Jan 12, 2022, 9:39 AM IST
Highlights

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన  వనమా రాఘవేందర్ రావుకు సహకరించిందెవరనే విషయమై పోలీస్ శాఖ అంతర్గత విచారణను ప్రారంభించింది. రాఘవ ఉపయోగించిన సిమ్ కార్డుల ఆధారంగా పోలీస్ శాఖ అంతర్గత విచారణను ప్రారంభించింది.

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా Palwancha రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే vanama venkateshwara rao తనయుడు  vanama raghavendra rao కు  పోలీస్ శాఖలో ఎవరు సహకరించారనే విషయమై  ఆ శాఖ అంతర్గత విచారణను ప్రారంభించింది.  వనమా రాఘవేందర్ కు police శాఖ నుండి కూడా సహకారం ఉందనే విమర్శలు కూడా లేకపోలేదు.

ఉమ్మడి Khammam జిల్లాలోని పాల్వంచలో Ramakrishna కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడింది., రామకృష్ణ ఆయన భార్య  శ్రీలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు.  ఈ నెల 7 రాత్రి వనమా రాఘవేందర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు Arrest చేశారు. అయితే వనమా రాఘవేందర్ అరెస్ట్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారుల వ్యూహాలను నిందితుడికి సమాచారం చేరవేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అయితే ఈ సమాచారాన్ని రాఘవేందర్ కు ఎవరు చేరవేశారనే విషయమై అంతర్గతంగా పోలీస్ శాఖ చేపట్టింది.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న తర్వాత పాల్వంచ నుండి అదృశ్యమైన రాఘవేందర్  Hyderabad విశాఖ తదితర ప్రాంతాల్లో గడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో  రాఘవేందర్ సిమ్ కార్డులను మార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే రాఘవ ఉపయోగించిన Sim కార్డులకు పోలీస్ శాఖ నుండి ఎవరెవరు సమాచారం ఇచ్చారనే విషయమై ఉన్నతాధికారులు విచారణను ప్రారంభించారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ పై Ipc 302, 307,306 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.వనమా రాఘవేందర్ ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై కొందరు పోలీసులకు సమాచారం లభించిందనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతుంది. హైద్రాబాద్ లో అరెస్టైనట్టుగా తొలుత ప్రచారం సాగింది. అయితే ఈప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు. అయితే మరునాడే రాఘవేందర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అరెస్టయ్యాడు. 

రాఘవ సిమ్ కార్డులు మార్చడం వల్ల ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని గుర్తించడం కష్టంగా మారిందని కూడా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. మరో వైపు రాఘవేందర్ రావు అనుచరులకు ఎక్కువగా ఏ పోన్ల నుండి ఫోన్లు వచ్చాయనే విషయమై పోలీసులు డేటాను సేకరించారు.ఈ data ఆధారంగా పోలీస్ శాఖ విచారణను ప్రారంభించింది. ఈ విచారణలో రాఘవేందర్ రావు కు సహకరించిందెవరనే విషయమై తేలనుంది.

kothagudem అసెంబ్లీ నియోజకవర్గంలో  పోలీస్ శాఖలో పోస్టింగ్ లన్నీ వనమా రాఘవేందర్ రావవు కనుసన్నల్లో సాగుతాయి. దీంతోనే రాఘవేందర్ రావుకు కొందరు పోలీసులు సహకరించి ఉంటారనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.  అయితే ఈ విషయమై  సరైన ఆధారాలను సేకరించే పనిలో అంతర్గత విచారణను ప్రారంభించింది పోలీస్ శాఖ.గతంలో కూడా వనమా రాఘవేందర్ రావుపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే పోలీస్ శాఖ ఆ ఫిర్యాదులను తొక్కి పెట్టిందనే విమర్శలు కూడా లేకపోలేదు. రామకృష్ణ ఆత్మహత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రాఘవేందర్ రావు బాధితులు మరోసారి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే గతంలో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సక్రమంగా వ్యవహరిస్తే  రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి కావన్నారు.

click me!