మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేష్: చిన్నశంకరంపేట కస్తూర్బా స్కూల్ వద్ద గుర్తింపు

By narsimha lodeFirst Published Dec 1, 2022, 4:13 PM IST
Highlights


మూడు రోజుల క్రితం  అదృశ్యమైన  సురేష్  అనే  యువకుడి ఆచూకీ లభ్యమైంది.  చిన్నశంకరంపేట కస్తూర్బా స్కూల్ వద్ద సురేష్  ఆచూకీని  పోలీసులు గుర్తించారు.  సురేష్ ను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.

మెదక్: ఉమ్మడి మెదక్  జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లితండాకు  చెందిన  సురేష్  ఆచూకీ లభ్యమైంది.  మూడు రోజుల క్రితం  సురేష్  అదృశ్యమయ్యాడు. ఇవాళ  చిన్నశంకరంపేట కస్తూర్బా  స్కూల్ వద్ద   సురేష్  ఆచూకీ  లభ్యమైంది.సురేష్  ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా  ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చందంపేట మండలానికి  చెందిన  విద్యార్ధినితో  సురేష్ మధ్య  ప్రేమ వ్యవహరం సాగుతుంది.  దీంతో  సోమవారంనాడు  విద్యార్ధినితో  ఫోన్  రాగానే  అతను  అక్కడికి వెళ్లాడు. అయితే  విద్యార్ధిని తండ్రి  గుర్తించి  సురేష్ ను చితకబాదాడు. సురేష్ బట్టలు, ఫోన్, బండి  విద్యార్ధిని  ఇంటి  వద్దే వదిలి సురేష్  వెళ్లిపోయాడు. పోలీసులు సురేష్  కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  డాగ్  స్క్వాడ్  గ్రామంలోని  చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయింది.  విద్యార్ధిని పేరేంట్స్ పైనే సురేష్  తల్లిదండ్రులు  ఆరోపణలు చేశారు. సోమవారం నుండి  సురేష్  కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇవాళ  కస్తూర్భా స్కూల్  వద్ద  ఆచూకీ లభ్యమైంది.

సురేష్  ఆచూకీ కోసం  కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం  పోలీస్ స్టేషన్  ఎదుట ఆందోళనకు దిగారు. సురేష్ ను పిలిపించిన యువతి  పేరేంట్స్ పైనే బాధిత  కుటుంబ సభ్యులు అనుమానం  వ్యక్తం  చేశారు.అయితే  ఇవాళ  సురేష్  చిన్నశంకంరపేట కస్తూర్బా  స్కూల్  వద్ద  ఉన్నట్టుగా గుర్తించినట్టుగా  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ  కథనం ప్రసారం చేసింది.  
 

click me!