వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు నిందితుల నుండి కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ మేరకు తమ కస్టడీలో ఉన్న నిందితుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు.
పెద్దపల్లి: వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు నిందితుల నుండి కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ మేరకు తమ కస్టడీలో ఉన్న నిందితుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు.తమ కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు బుధవారం నాడు మంథని కోర్టుకు తీసుకెళ్లారు. హత్యకు ముందు రెక్కీ చేసిన ప్రాంతాల్లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.
వామన్ రావు దంపతులను హత్య చేసేందుకు వారి కదలికలపై నిందితులు రెక్కీ చేశారు.ఈ రెక్కీ ఎలా చేశారనే విషయమై పోలీసులు ఆరా తీశారు.కోర్టు నుండి నిందితులు కల్వచర్లకు ఎలా వెళ్లారు. వామన్ రావు దంపతుల కంటే ముందే ఎలా వెళ్లారనే అనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
undefined
హత్య జరిగిన తీరును కుంట శ్రీను, కుమార్, చిరంజీవిలు పోలీసులకు వివరించారు. నడిరోడ్డుపైనే వామన్ రావు దంపతులను హత్యచేసిన తీరును పోలీసులకు కళ్లకు కట్టినట్టుగా వివరించారు.
గత నెల 17వ తేదీన పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపైనే వామన్ రావు దంపతులను హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన నిందితులతో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు.