కాంగ్రెస్ కు షాక్: వైఎస్ షర్మిలతో ఇందిరా శోభన్ పోశాల భేటీ

By telugu teamFirst Published Mar 3, 2021, 3:26 PM IST
Highlights

ఇందిరా శోభన్ పోశాల కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె వైఎస్ షర్మిలను కలిశారు వైెఎస్ షర్మిలతో తాను కలిసి పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెసుపై విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇందిరా శోభన్ పోశాల కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బుధవారంనాడు హైదరాబాదులోని లోటస్ పాండులో వైఎస్ షర్మిలను కలిశారు.  షర్మిల కు మద్దుతుగా ఓ మహిళగా అమెను కలిసినట్లు ఇందిరా శోభన్ పోశాల చెప్పారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నైజం తనదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని, కాంగ్రెస్ లో ఉంటే అది సాధ్య పడదని ఆమె అన్నారు.  కాంగ్రెస్ లో తనకు సముచిత స్థానం కల్పించలేదని విమర్శించారు.. గ్రూప్ రాజకీయాల వల్ల ఉత్తమ్ తీసుకున్న నిర్ణయాలు వల్ల తాను బయటకు వచ్చినట్లు తెలిపారు.

రాజన్న సంక్షేమ పథకాల వల్ల ఆయన పాలనలోస్వర్ణ యుగం నడుచిందని ఆమె ప్రశంసించారు. తెలంగాణ లక్ష్యాన్ని  ప్రస్తుత ప్రభుత్వం నీరు గార్చుతోందని అన్నారు. మహిళలంతా  షర్మిల కు మద్దతుగా నిలబడతారని అన్నారు.

కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు అడ్డాగా మారిందని, ప్రజా సమస్యలను  గాలికి వదిలేసిందని ఇందిరా శోభన్ పోశాల విమర్శించారు. కేంద్రం అండ లేకుండా ఇక్కడ కేసీఆర్ ఆటలు కొనసాగవని, రెండు పార్టీలకు ఒప్పందం ఉందని అన్నారు.

మతం, కులం, సర్జికల్ స్ట్రైక్  ద్వారానే బీజేపీ ప్రజల్లోకి వెళ్తోందని అన్నారు. ప్రజా సమస్యలపై అన్ని పార్టీలు గాలికి వదిలేసాయి కాబట్టి మరో పార్టీ అవసరం ఏర్పడిందని అన్నారు.  తెలంగాణ హక్కుల కోసం తాము ప్రథమ పోరాటం అని షర్మిల చెప్పారని ్న్నారు. తన బాట కూడా అదే కావడంతో షర్మిలను కలవడానికి వచ్చానని అన్నారు. పని చేసినపుడు పదవి అడగడంలో తప్పులేదని, అందుకే సీటు ఆశించానని చెప్పారు.

click me!