విడాకుల కేసు: కోర్టు ప్రాంగణంలో వియ్యంకుడిపై కానిస్టేబుల్ దాడి

Siva Kodati |  
Published : Jul 01, 2019, 01:37 PM IST
విడాకుల కేసు: కోర్టు ప్రాంగణంలో వియ్యంకుడిపై కానిస్టేబుల్ దాడి

సారాంశం

ఖమ్మం కోర్టు ప్రాంగణంలో సోమవారం పోలీస్ కానిస్టేబుల్ హలచల్ చేశాడు.  ఓ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. కుమార్తె విడాకుల విషయంలో కోర్టుకు హాజరై వస్తున్న వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు. 

ఖమ్మం కోర్టు ప్రాంగణంలో సోమవారం పోలీస్ కానిస్టేబుల్ హలచల్ చేశాడు.  ఓ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. కుమార్తె విడాకుల విషయంలో కోర్టుకు హాజరై వస్తున్న వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు.

సదరు హెడ్ కానిస్టేబుల్ కొడుకుతో అబ్బనపురి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి  2018లో తన కూతురి పెళ్లి చేశాడు. అయితే దంపతుల మధ్య కొద్దిరోజులకే మనస్పర్థలు రావడంతో న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ వేశాడు కానిస్టేబుల్ కుమారుడు.

ఈ కేసులో విచారణకు హాజరై వస్తున్న వెంకటేశ్వర్లును హెడ్ కానిస్టేబుల్ అడ్డగించి.. విచక్షణారహితంగా వారిపై దాడి చేశాడు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Telangana Jobs: తెలంగాణలో భారీగా ఉద్యోగాలు.. నాలుగు నోటిఫికేషన్లు విడుదల
Flood Alert : ఈ రెండ్రోజుల్లో 400 మిమీ వర్షం కురిసే ఛాన్స్.. ఈ తెలంగాణ జిల్లాలకు పొంచివున్న వరద ముప్పు