రాకేష్‌రెడ్డితో సహజీవనం: జయరామ్ హత్య కేసులో శిఖా పాత్రను తేల్చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Jun 10, 2019, 12:41 PM IST
Highlights

పారిశ్రామిక వేత్త  జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఏమీ లేదని పోలీసులు తేల్చారు. అయితే శిఖా చౌదరిపై చేసిన లక్షల రూపాయాలను తిరిగి రాబట్టుకొనే క్రమంలోనే రాకేష్ రెడ్డి జయరామ్‌ను ఎంచుకొన్నాడని  బంజారాహిల్స్ పోలీసులు చార్జీషీట్‌లో ప్రస్తావించారు.
 

హైదరాబాద్: పారిశ్రామిక వేత్త  జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఏమీ లేదని పోలీసులు తేల్చారు. అయితే శిఖా చౌదరిపై చేసిన లక్షల రూపాయాలను తిరిగి రాబట్టుకొనే క్రమంలోనే రాకేష్ రెడ్డి జయరామ్‌ను ఎంచుకొన్నాడని  బంజారాహిల్స్ పోలీసులు చార్జీషీట్‌లో ప్రస్తావించారు.

గత ఏడాది జనవరి 31వ తేదీన జయరామ్ హత్యకు గురయ్యాడు.  జయరామ్ హత్య కేసులో  ఏ1 గా రాకేష్ రెడ్డి, ఏ2 విశాల్‌ పేర్లను పోలీసులు చేర్చారు. 23 పేజీల చార్జీషీట్‌ను కోర్టులో సమర్పించారు.

శిఖా చౌదరితో కొంత కాలం పాటు రాకేష్ రెడ్డి సహజీవనం చేశాడు. ఈ సమయంలో  ఆమెపై లక్షల రూపాయాలను ఖర్చు చేశాడు. కొంత కాలానికి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో రాకేష్‌రెడ్డికి శిఖా చౌదరి బ్రేకప్ చెప్పింది.

అంతేకాదు రాకేష్ రెడ్డిపై శిఖా చౌదరి తప్పుడు ప్రచారం చేసింది. దీంతో రాకేష్ రెడ్డి శిఖా చౌదరిపై కక్ష పెంచుకొన్నాడని చార్జీషీటులో పోలీసులు పేర్కొన్నారు. శిఖా చౌదరిని డబ్బులు ఇవ్వాలని కోరినా ఆమె పట్టించుకోలేదు. 

దీంతో జయరామ్, శిఖా చౌదరి ఇళ్ల వద్ద తన మనుషులను ఏర్పాటు చేసుకొన్నాడు. జయరామ్ అమెరికా నుండి ఇండియాకు వచ్చిన వెంటనే  రాకేష్ రెడ్డి ప్లాన్ చేసి  అతడిని కిడ్నాప్ చేశారని పోలీసులు చార్జీషీట్‌లో ప్రస్తావించారు.

హానీట్రాప్ ద్వారా  జయరామ్‌ను కిడ్నాప్ చేశారు. జయరామ్‌ను చిత్రహింసలకు గురి చేసే సమయంలో ఆయనకు తెలియకుండానే వీడియాలను చిత్రీకరించారు. ఈ వీడియోలను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయాన్ని కూడ పోలీసులు చార్జీషీట్‌లో ప్రస్తావించారు. 

తనకు ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రికి తీసుకెళ్లాలని జయరామ్  ప్రాధేయపడినా కూడ రాకేష్ రెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లలేదని కూడ పోలీసులు చార్జీషీట్‌లో రాశారు. తన వద్ద రూ.4.5 కోట్లను జయరామ్ అప్పుగా తీసుకొన్నాడని కూడ రాకేష్ రెడ్డి బాండ్ రాయించుకొన్నాడు.  బాండ్ పై జయరామ్ సంతకాలు చేసే దృశ్యాలు కూడ పోలీసులు సేకరించారు. ఈ విషయాలను పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసు: రాకేష్ రెడ్డి సహా 12 మందిపై చార్జీషీటు

click me!