జయరామ్ హత్య కేసు: రాకేష్ రెడ్డి సహా 12 మందిపై చార్జీషీటు

By narsimha lodeFirst Published Jun 10, 2019, 12:14 PM IST
Highlights

 ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసులు 23 పేజీల చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీటులో ముగ్గురు పోలీసుల పేర్లను కూడ చేర్చారు. 
 


హైదరాబాద్:  ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసులు 23 పేజీల చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీటులో ముగ్గురు పోలీసుల పేర్లను కూడ చేర్చారు. 

హనీట్రాప్ ద్వారా ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్‌ను  హత్య చేసినట్టుగా  పోలీసులు చార్జీషీటులో పేర్కొన్నారు. గత ఏడాది జనవరి 31వ తేదీన జయరామ్ ను రాకేష్ రెడ్డి హత్య చేశాడు. ఈ కేసు విషయమై కోర్టులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు.

చిగురుపాటి హత్య కేసులో 73 మంది సాక్షులను విచారించినట్టుగా పేర్కొన్నారు. 73 మంది సాక్షుల్లో  11వ సాక్షిగా జయరామ్  మేనకోడలు శిఖాచౌదరి పేరును కూడ ప్రస్తావించారు.

పోలీసుల సలహతోనే జయరామ్ ను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి మృతదేహన్ని ఏపీ రాష్ట్ర శివారులో  వదిలివేసినట్టుగా పోలీసులు చార్జీషీటులో పేర్కొన్నారు.

హానీట్రాప్ ద్వారా జయరామ్‌ నుండి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆయనను రాకేష్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా చార్జీషీటులో పేర్కొన్నారు.తనకు ఆరోగ్యం బాగాలేదు... ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినా కూడ రాకేష్ రెడ్డి మాత్రం సహకరించలేదని పోలీసులు చార్జీషీటులో పేర్కొన్నారు.

తనను ప్రాణాలతో వదిలేస్తే ప్రతి నెల రూ.50 లక్షలను చెల్లిస్తానని రాకేష్ రెడ్డికి జయరామ్ చెప్పినా కూడ అతను ఒప్పుకోలేదని చార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో  నల్లకుంట సీఐ శ్రీనివాసులు, మరో పోలీసు అధికారి రాంబాబు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిలను కూడ బంజారాహిల్స్ పోలీసుల  నిందితులుగా చేర్చారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు.  

ఈ కేసులో ఏ1 రాకేష్ రెడ్డిని, ఏ2 విశాల్‌ పేరును చేర్చారు.  మరోవైపు జయరామ్ శరీరంలో ఎలాంటి విష పదార్థాలు లేవని చార్జీషీట్లో పేర్కొన్నారు.శిఖా చౌదరితో రాకేష్ రెడ్డి ప్రేమాయణం గురించి కూడ చార్జీషీట్‌లో ప్రస్తావించారు. జయరామ్‌ నుండి  రూ.4.5కోట్లు అప్పుగా ఉన్నట్టుగా  బాండ్ పేపర్లు రాసి బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించాడని  పోలీసులు  చార్జీషీట్‌లో ప్రస్తావించారు. 

click me!