ఎవ్వరిని వదలని పోలీసులు: మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కారులో తనిఖీలు

sivanagaprasad kodati |  
Published : Dec 03, 2018, 10:15 AM IST
ఎవ్వరిని వదలని పోలీసులు: మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కారులో తనిఖీలు

సారాంశం

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల నిమిత్తం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల నిమిత్తం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పలువురు ప్రముఖుల వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. తాజాగా పరకాల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ప్రచారం నిమిత్తం వెళ్తున్న భారత మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ కారును పోలీసులు తనిఖీ చేశారు.

వాహనంలో ఎలాంటి అక్రమ తరలింపులు లేకపోవడంతో అజహార్‌ను పంపేశారు. మరోవైపు ఇదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కారును కూడా పోలీసులు తనిఖీ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu