నిర్మల్‌లో దారుణం.. మైనర్ బాలికపై మున్సిపల్ వైఎస్ చైర్మన్‌ అఘాయిత్యం..

Published : Feb 27, 2022, 01:54 PM IST
నిర్మల్‌లో దారుణం.. మైనర్ బాలికపై మున్సిపల్ వైఎస్ చైర్మన్‌ అఘాయిత్యం..

సారాంశం

నిర్మల్ మున్సిపల్ వైఎస్ చైర్మన్‌ సాజిద్ ఖా‌న్‌పై పోలీసు కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాజిద్ ఖాన్‌ పరారీలో ఉన్నాడు


టీఆర్‌ఎస్ నేత, నిర్మల్ మున్సిపల్ వైఎస్ చైర్మన్‌ సాజిద్ ఖా‌న్‌పై పోలీసు కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాజిద్ ఖాన్‌ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ ఉపేందర్ రెడ్డి  మాట్లాడుతూ.. సాజిద్ ఖాన్‌పై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. మూడు, నాలుగు బృందాలను నిందితుడిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఎంతటివారైనా సరే చట్టం ముందు సమానమేనని అన్నారు. 

నిర్మల్​ మున్సిపల్ వైస్​ చైర్మన్ సాజిద్ ఖాన్ గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఓ బాలిక.. బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించింది. వారి సాయంతో శనివారం రాత్రి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం బాలికపై అత్యాచారం జరిగిన విషయం వాస్తవమని తేలిందని పోలీసులు తెలిపారు.  అతనిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇక, సాజిద్ ఖాన్ బాలికకు మాయమాటలు చెప్పి.. గత నెలలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్