పోలీసుల కళ్లు గప్పి... సీఐ వాహనం చోరీ..!!

Published : Nov 13, 2020, 09:17 AM IST
పోలీసుల కళ్లు గప్పి... సీఐ వాహనం చోరీ..!!

సారాంశం

నలుగురు యువకులను సీఐ విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ఓ యువకుడు సీఐ వాహనాన్ని చోరీ చేశాడు. సీఐ వాహనం తీసుకొని సదరు యువకుడు కోదాడ వైపు పరారయ్యాడు. 

పోలీసుల కళ్లు గప్పి దొంగలు ఏకంగా సీఐ వాహనాన్నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  మిర్యాలగూడ టౌన్ ఈదులగూడ సర్కిల్ వద్ద రూరల్ సీఐ రమేష్ బాబు పోలీసు వాహనం చోరీకి గురైంది.

గురువారం అర్థరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సీఐ విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ఓ యువకుడు సీఐ వాహనాన్ని చోరీ చేశాడు. సీఐ వాహనం తీసుకొని సదరు యువకుడు కోదాడ వైపు పరారయ్యాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసమయ్యింది.

దీంతో పోలీసులు చేజింగ్ చేసి ఆలగడప టోల్ గేట్ వద్ద సీఐ వాహనాన్ని రూరల్ ఎస్ఐ పరమేష్ పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  అతని వద్ద నుంచి పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం