
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలోని సాయిధామం (Keesara Saidhamam) ఆశ్రమం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆశ్రమానికి చెందిన రామనందప్రభు స్వామీజీని (Ramananda Prabhu SwamiJi) పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రామనందప్రభు స్వామీజీని ముందస్తు నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని అక్కడివారు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా అరెస్ట్ చేశారని తెలిపారు. అక్రమార్కులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని.. సాయిధామం ఆశ్రమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని, అందుకు అడ్డుపడుతున్నందుకే స్వామిజీపై వేధింపులకు పాల్పడుతున్నారని, అందుకే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆశ్రమ సభ్యులతో పాటుగా, హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్వామీజీ వేధింపులకు పాల్పడినట్టుగా ఓ మహిళ ఫిర్యాదు చేసిందని.. అందుకే ఆయనను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు.
ఇక, కీసర మండలం అంకిరెడ్డిపల్లి సమీపంలో శ్రీ సత్యాపదనంద ప్రభుజీ 1989లో సాయిధామం ఆశ్రమం నెలకొల్పారు. ఆశ్రమంలో సాయిబాబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది సాయిధామంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. అయితే 2015లో సత్యపదానంద ప్రభూజీ శివైక్యం చెందారు. అయితే ఆ తర్వాత ఆశ్రమ నిర్వహకులు అధిపత్యం కోసం రెండు వర్గాలుగా చిలిపోయారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఆశ్రమంలో గొడవలు జరుగుతున్నాయి