పరువు హత్య: బావను చంపిన బావమరిది, నిందితుడి అరెస్ట్

sivanagaprasad kodati |  
Published : Jan 09, 2019, 08:46 AM IST
పరువు హత్య: బావను చంపిన బావమరిది, నిందితుడి అరెస్ట్

సారాంశం

హైదరాబాద్ తిరుమలగిరిలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆల్వాల్ వెంకటాపురానికి చెందిన నందకిశోర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు

హైదరాబాద్ తిరుమలగిరిలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆల్వాల్ వెంకటాపురానికి చెందిన నందకిశోర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. ఈ క్రమంలో పెద్ద కమేళా ప్రాంతానికి చెందిన అశ్వినిని ప్రేమించిన అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. వీరి పెళ్లి అశ్విని తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదు.. ఈ దంపతులుకు ఒక కుమారుడు జన్మించాడు. ఈ మధ్యకాలంలో అశ్విని తల్లిదండ్రులు నీ భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే మరో పెళ్లి చేస్తామంటూ కూతురికి చెబుతూ వస్తున్నారు.

కొద్దిరోజుల నుంచి ఈ ఒత్తిడి మరింత ఎక్కువవ్వడంతో విషయం నందకిశోర్‌‌కు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒక రోజు అశ్విని తన కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సోదరిని పెళ్లి చేసుకుని తమ పరువు తీశాడని పగతో రగిలిపోతున్న అశ్విని సోదరుడు మిచెల్‌ బావను చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఈ విషయాన్ని బంధువులకు చెప్పి వారి సాయం కూడా తీసుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 29న నందకిశోర్‌ను పెద్ద కమేళా ఆర్మీ రేంజ వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన అతడితో అశ్విని బంధువులు, మిచెల్ కలిసి మద్యం తాగి, గొడవ పెట్టుకున్నారు.

అశ్వినిని పెళ్లి చేసుకుని తమ కుటుంబ పరువు తీశావంటూ కోపంతో ఊగిపోయిన మిచెల్.. నందకిశోర్‌ను బండరాయితో పాటు కర్రతో తలపై మోదాడు. చనిపోయాడనుకుని నిర్ణయించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

కుమారుడి జాడ కనిపించకపోవడంతో నందకిశోర్‌ తల్లి సక్కుబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు అసలు సూత్రధారి మిచెల్‌ను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా