సిద్దిపేట కాల్పుల కేసును చేధించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత

Published : Feb 07, 2022, 12:49 PM IST
సిద్దిపేట కాల్పుల కేసును చేధించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత

సారాంశం

సిద్దిపేట (Siddipet) కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈ నేరానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 34 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సిద్దిపేట (Siddipet) కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈ నేరానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 34 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బులను నిందితులు అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగించినట్టుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట సీపీ శ్వేత సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ శ్వేత చెప్పారు. టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నట్టుగా తెలిపారు. ప్రత్యేక బృందాలు సమర్ధవంతంగా పనిచేశాయని చెప్పారు. 

‘సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నర్సయ్య కారులో ఉంచిన డబ్బులను కారు డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి, గాయపరిచి 43.50 లక్షల రూపాయలను దొంగిలించారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించారు. నమ్మదగిన సమాచారం మేరకు నిన్న ఉదయం ఎడమ సాయి కుమార్ (ఏ-2) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. అతనితో ఏ-1 గజ్జె రాజు, ఏ-3 బల్లిపురం కరుణాకర్, ఏ-4  వంశీకృష్ణ నేరంలో పాల్గొన్నట్టుగా విచారణలో తేలింది. ఆ విచారణ ఆధారంగా వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తును, చోరీకి వినియోగించిన వాహనాలను, సెల్‌ఫోన్లను పోలీసులు చేశారు.   

ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జె రాజు(26) కొండపాక మండలంకు చెందిన వ్యక్తి... కీసర మండంలో నివాసం ఉంటున్నాడు. సమీప బంధువు ఎడమ సాయికుమార్‌తో పాటు ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. గతేడాది ఆగస్టులో అరెస్ట్ అయి.. సెప్టెంబర్‌లో విడుదలయ్యారు. ఈ క్రమంలోనే వారికి అప్పులు పెరిగిపోయాయి. దీంతో రాజు, సాయికుమార్, కరుణాకర్‌లు ఏదైనా నేరం చేసి డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. ముందస్తు ప్రణాళిక వేసుకుని.. ఒక నెంబర్ లేని బైక్‌ను చోరీ చేశారు. డ్రైవర్ ఒంటరిగా ఉన్న సమయంలో అతని వద్దకు వెళ్లి అతనిపై దాడి చేసి డబ్బులను తీసుకుని పారిపోయారు. నలుగురు నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 34 లక్షల నగదు, 2 బైక్‌లు, ఒక కారు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం’ అని సీపీ శ్వేత తెలిపారు. 

ఇక, చేర్యాలకి చెందిన నర్సయ్య అనే వ్యక్తి సిద్దిపేటలోని హెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నారు. సిద్దిపేటలోని ఓ ప్లాట్ విక్రయానికి సంబంధించి జనవరి 31న రిజిస్ట్రేషన్ ఉండడంతో కారులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద  కారులో ఉంచిన నగదును దోచుకునేందుకు దుండుగులు కాల్పులు జరిపారు. కారు డ్రైవర్‌‌ని తుపాకీతో కాల్చి నగదు బ్యాగ్‌తో అక్కడి నుంచి పరారయ్యారు. ఊహించని ఘటనతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా అలజడి రేగింది. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే