తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం, ఏకగ్రీవంకానున్న ఎన్నిక

By sivanagaprasad KodatiFirst Published Jan 17, 2019, 11:35 AM IST
Highlights

తెలంగాణ శాసనసభ రెండవ స్పీకర్‌గా టీఆర్ఎస్ సీనియర్ నేత, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా ఖరారయ్యారు. . ఇవాళ తెలంగాణ అసెంబ్లీ కోలువుదీరనున్న నేపథ్యంలో శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో పోచారంతో సమావేశమయ్యారు. దీనితోపాటు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు గాను కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎంలతో సీఎం చర్చలు జరిపారు. 

తెలంగాణ శాసనసభ రెండవ స్పీకర్‌గా టీఆర్ఎస్ సీనియర్ నేత, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా ఖరారయ్యారు. సభాపతిగా ఎవరిని నియమించాలనే దానిపై తొలుత అనేకమందితో కేసీఆర్ చర్చించారు. ఈటల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే వారు ఈ పదవికి చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కేసీఆర్ దృష్టి పోచారంపై పడింది. ఆయన్ను ఒప్పించిన కేసీఆర్ పలు దఫాలుగా భేటీ అయ్యారు. సమావేశమయ్యారు. దీనితోపాటు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు గాను కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎంలతో సీఎం చర్చలు జరిపారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నికలో పోటీకి దిగకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ మద్దతుతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ కోలువుదీరనున్న నేపథ్యంలో శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో పోచారంతో

అందరిని కలుపుకుపోయే వ్యక్తిగా మంచి పేరున్న పోచారంకు ఆయా పార్టీలు మద్ధతు ప్రకటించడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. మరికొద్దిసేపట్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌గా నామినేషన్ వేయనున్నారు. అనంతరం రేపు స్పీకర్ ఎన్నిక పూర్తయినట్లు అధికారికంగా ప్రకటిస్తారు.

click me!