కేసిఆర్ కు ట్రైనింగ్ ఇచ్చింది కాంగ్రెస్సే, ఇంటికి పంపండి: మోడీ

By sivanagaprasad KodatiFirst Published Nov 27, 2018, 1:14 PM IST
Highlights

ఐదేళ్లు సుపరిపాలన అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలోనే ఆగిపోయాడని మాట తప్పినందుకు ఆయన్ను ఇంటికి  పంపాలన్నారు ప్రధాని.

ఐదేళ్లు సుపరిపాలన అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలోనే ఆగిపోయాడని మాట తప్పినందుకు ఆయన్ను ఇంటికి  పంపాలన్నారు ప్రధాని. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభ్యలో ప్రధాని మోడీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై వాగ్భాణాలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లు ఏం చేసిందో మీరు ప్రశ్నించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లకు ముందు యువకులు, రైతులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు నిలదీసి.. టీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని మోడీ అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాటు ఏం చేసిందో కేసీఆర్ కూడా అదే ఫాలో అవుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌ను లండన్‌లా అమలు చేస్తానని కేసీఆర్ ప్రకటించారని.. ఆ లండన్ ఎలా ఉందో చూద్దామని హెలికాఫ్టర్‌లో వస్తుండగా పరశీలిస్తే వెనుకబడిన రాష్ట్రాల్లలా పరిస్థితి ఉందని మోడీ ఎద్దేవా చేశారు.

లండన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి అక్కడికి వెళ్లి చూసి రావాలని సెటైర్ వేశారు. యూపీఏ పాలనలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. సోనియా గాంధీ ఉప్పు తిన్నారన్నారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయరని అంతా ఫ్రెండ్లీ మ్యాచేనని నరేంద్రమోడీ విమర్శించారు. 

click me!