కూకట్ పల్లిలో టీఆర్ఎస్ కు షాక్: కీలక నేత రాజీనామా

By pratap reddyFirst Published Nov 27, 2018, 12:48 PM IST
Highlights

హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి పెద్ద దెబ్బే తగిలింది. టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

హైదరాబాద్‌: హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి పెద్ద దెబ్బే తగిలింది. టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

తన రాజీనామా విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ ని తన ఇల్లులా, కేసీఆర్‌ను తన తండ్రిలా భావించానని, తనతోపాటు చాలామందికి పార్టీలో తీరని అన్యాయం జరిగినా ఓపికగా మార్పుకోసం ఎదురుచూశామని అన్నారు. 

కేసీఆర్‌ తెలంగాణ వాదాన్ని పూర్తిగా మరిచి పోయారని, పార్టీ పక్కదారి పడుతోందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. దాంతో తన క్రియాశీలక సభ్యత్వానికి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రజా కూటమి అభ్యర్థికి నందమూరి సుహాసిని, టీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

click me!