
మేడ్చల్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ఓ నర్సరీలో ఇండియా మ్యాప్ ఆకారంలో మొక్కలను అమర్చి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొన్నారు.
మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేశ్వర్ మండలంలోని ఏదులాబాద్ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీ ఉంది.ఈ నర్సరీలో ఇండియా మ్యాప్ ఆకారంలో మొక్కలను అమర్చారు.
ఈ నర్సరీలో పనిచేసే సిబ్బంది ఈ రకంగా ఇండిపెండెన్స్ డే ఉత్సవాలను జరుపుకొన్నారు.