Extra marital Affair : కొడుకుతో కలిసి దివ్యాంగుడైన ప్రియుడిని అంతమొందించిన ప్రియురాలు.. వద్దంటే వినడం లేదని...

Published : Feb 15, 2022, 10:19 AM IST
Extra marital Affair : కొడుకుతో కలిసి దివ్యాంగుడైన ప్రియుడిని అంతమొందించిన ప్రియురాలు.. వద్దంటే వినడం లేదని...

సారాంశం

పిల్లలు పెద్దగా అయ్యారు.. ఒకసారి తప్పు చేశాం.. అది ఇంకా కొనసాగించడం మంచిది కాదు.. ఇంతటితో ఆపేద్దాం.. అని ఆమె చెప్పిన మాటలు పెడచెవిన పెట్టాడో ప్రబుద్ధుడు.. తీరు మార్చుకోకుండా వివాహేతర సంబంధం కొనసాగించాలని బలవంతం చేశాడు. దీంతో.. 

నల్గొండ : nalgondaలో ఓ దివ్యాంగుడు దారుణ murderకు గురయ్యాడు.  ఈ ఘటన  dindi mandal పరిధిలో  సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… దిండి మండల పరిధిలోని  పడమటి తండాకు చెందిన జర్పుల చీన్యా(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం Electric shock చోటు చేసుకోవడంతో రెండు చేతులు కోల్పోయాడు. చీన్యాకు అదే తండాకు చెందిన మహిళతో వివాహం జరిగింది.  వారికి కుమారుడు శివ జన్మించాడు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా చీన్యా  భార్య కుమారుడిని వదిలి ఇంటినుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి చీన్యా కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాగా చీన్యా అదే తండాకు చెందిన మహిళ రాత్లావత్(పండు)తో Extra marital Affair లో ఉన్నాడు. ఈ విషయం పెద్ద మనుషుల వద్దకు వెళ్ళినా తీరు మార్చుకోలేదు. 20 ఏళ్లుగా సక్యతగానే ఉంటున్నారు.

పిల్లలు పెద్దయ్యారని…
చీన్యా కుమారుడు శివకు 20 ఏళ్ళు .. కాగా పండు కుమారుడికి వివాహం జరిగింది. ఇక ఇద్దరం కలుసుకోవడం కుదరదని పండు ప్రియుడు చీన్యాకు చెప్పింది. అయినా చీన్యా వినకుండా ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుని.. ఈ విషయం తన కుమారుడు సురేష్ కు తెలిపి పథకం రచించింది. అనుకున్న విధంగానే ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చీన్యా భర్త లేని సమయంలో పండు ఇంటికి వెళ్ళాడు. ఇదే అదనుగా.అప్పటికే మాటువేసి ఉన్న పండు, ఆమె కుమారుడు సురేష్ చీన్యాపై గొడ్డలితో తీవ్రంగా దాడి చేశారు. దీంతో  చీన్యా అక్కడినుంచి పారిపోతుండగా పట్టుకుని ఇంటి వద్దకు లాక్కెళ్ళి నరికి దారుణంగా మట్టుబెట్టారు. సమాచారం తెలుసుకున్న చీన్యా కుమారుడు శివ అతడి కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి అతడు రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.

సర్పంచ్ కు ఫోన్ చేసి..
చీన్యాను హత్య చేసిన విషయాన్ని పండు స్థానిక సర్పంచ్ పాండుకు ఫోన్ చేసి చెప్పింది. పిల్లలు పెద్దగా అయ్యారని.. పెళ్లిళ్లు కూడా అవుతున్నాయని.. ఇప్పుడు ఇంకా వివాహేతర సంబంధం కొనసాగించడం సరి కాదని, ఇంతటితో ఆపేద్దాం అని.. గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయవద్దని నెత్తీ, నోరు కొట్టుకుని చెప్పానా.. వినకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఏం చేయాలో తోచక.. తప్పని సరి పరిస్తిత్తుల్లో చంపేశామని వివరించింది. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..  ఘటనా స్థలాన్ని సీఐ బిసన్న, డిండి ఎస్ఐ  సురేష్, చందంపేట ఎస్సై  యాదయ్య పరిశీలించారు. 

చీన్యాను తానే గొడ్డలితో నరికి చంపాను అని పండు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !