అర్థరాత్రి సినిమా ఫక్కీలో గ్యాంగ్ వార్... కళ్లల్లో కారం చల్లి, కర్రలు, రాడ్లతో దాడి...

Published : Feb 15, 2022, 09:35 AM IST
అర్థరాత్రి సినిమా ఫక్కీలో గ్యాంగ్ వార్... కళ్లల్లో కారం చల్లి, కర్రలు, రాడ్లతో దాడి...

సారాంశం

హైదరాబాద్ లో అర్థరాత్రి గ్యాంగ్ వార్ కలకలం రేపింది. డబ్బుల విషయంలో గొడవ వచ్చి పేకాట స్థావరాలు నడిపే ఇద్దరు వ్యక్తుల తమ గ్యాంగులతో గొడవకు దిగారు. ఈ గొడవల్లో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. 

హైదరాబాద్ : రహస్యంగా Poker స్థావరాలు నిర్వహిస్తున్న రెండు వర్గాల మధ్య ఆదివారం అర్థరాత్రి gangwar జరిగింది. కళ్లల్లో కారంపొడి చల్లుకుని కర్రలు, రాడ్లతో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. సినిమా ఫక్కీలో జరిగిన Pate Bashirabad పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి డబ్బు వసూలు విషయంలో కలుగ చేసుకున్న యువకుడు ప్రత్యర్థులతో గొడవకు దిగి.. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గొడవకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

షాపూర్ నగర్ ప్రాంతానికి చెందిన చేపల రాము, జీడిమెట్ల రామిరెడ్డి నగర్ కు చెందిన మణికంఠ కొంతకాలంగా నగర శివార్లలో వేర్వేరుగా పేకాట క్లబ్ లను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా వీరి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇదిలా ఉండగా..  గతంలో తన వద్ద పనిచేసిన రమేష్ కు రాము కొంత డబ్బు బాకీ పడినట్లు తెలిసింది.  ఆ డబ్బు వసూలు విషయంలో రాముకు, రమేష్ కు గొడవ జరిగింది. దాంతో తన డబ్బులు ఎలాగైనా వసూలు చేసుకోవాలని భావించిన రమేష్ ఈ విషయాన్ని తన స్నేహితుడు మణికంఠకు చెప్పాడు. దీంతో మణికంఠ ఫోన్ చేసి తన స్నేహితుడికి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చేయాలని రాము హెచ్చరించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. డీపీఆర్ స్కూల్ వద్దకు రావాలంటూ మణికంఠకు రాము సవాల్ విసిరాడు. మణికంఠ తన అనుచరులతో స్కూల్ వద్దకు వెళ్ళగా.. అప్పటికే దాదాపు 20 మందితో కాపు కాచి ఉన్న రాము.. ఒక్కసారిగా వారిపై విరుచుకు పడ్డారు. కళ్లల్లో కారం చల్లి, కర్రలు, రాడ్లు వంటి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. మణికంఠ గ్యాంగ్ కూడా వారిపై ఎదురు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మణికంఠ రక్తపు మడుగులో పడి పోయాడు.  

మరో వ్యక్తి శ్రీహరి రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య జరుగుతున్న గ్యాంగ్ వార్ ను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన సూరారం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మణికంట పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu