ఎంఐఎం నేత సయ్యద్ కషఫ్‌పై పీడీ యాక్ట్ నమోదు..

By Sumanth KanukulaFirst Published Aug 30, 2022, 2:22 PM IST
Highlights

ఎంఐఎం పార్టీ నేత సయ్యద్ కషఫ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మత ఘర్షణలకు అవకాశం కల్పించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కషఫ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 

ఎంఐఎం పార్టీ నేత సయ్యద్ కషఫ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.మత ఘర్షణలకు అవకాశం కల్పించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కషఫ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల రాజా సింగ్ వ్యవహారం తర్వాత కషఫ్.. యూట్యూబ్‌లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు.అయితే గతంలో కూడా కషఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక, ఇటీవల గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విడుదల చేసిన ఓ వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు వ్యతిరేకంగా ఓ వర్గం తీవ్ర నిరనసలకు దిగింది. ఈ క్రమంలోనే చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం‌లో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ఇక, రాజాసింగ్‌పై 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని చెప్పారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రాజాసింగ్‌పై గతంలోనే రౌడీషీట్ ఉందన్నారు. గత కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా చెప్పారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. మత ఘర్షణలు చోటుచేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉన్నాయని చెప్పారు. 

ఈ నెల 22న రాజాసింగ్ రెచ్చగొట్టేలా ఓ యూట్యూబ్ చానల్‌‌లో ఓ వీడియో పోస్టు చేశారని సీవీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియో పోస్టు చేశారని చెప్పారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు.  ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారని చెప్పారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకన్నాయని చెప్పారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. 

click me!