సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఉత్తమ్

First Published Jun 2, 2018, 1:04 PM IST
Highlights

కెసిఆర్‌పై ఉత్తమ్ విమర్శలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం
సాధ్యమని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
చెప్పారు.

శనివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో దగాపడ్డ తెలంగాణ
అనే పోస్టర్‌ను గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. 

 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ఇచ్చిన హమీలను
నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని కెసిఆర్ అపహస్యం పాలు చేస్తున్నారని
ఆయన చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని కెసిఆర్ ఇచ్చిన
హమీలను అమలు చేయలేదన్నారు. దీంతో నిరుద్యోగులు
తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారని ఆయన చెప్పారు.

4 లక్షల మంది దళితులంటే 4 వేల మందికి మాత్రమే
మూడెకరాలను  భూపంపిణీ చేశారని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కెసిఆర్ కుటుంబమే
లాభపడిందని  ఆయన చెప్పారు.

click me!