ఆర్టీసీ కార్మికులకు ఊరట: సోమవారంలోపు జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం

By sivanagaprasad KodatiFirst Published Oct 16, 2019, 11:58 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. సోమవారం లోపు సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఉద్యోగుల జీతాలను యాజమాన్యం నిలిపివేసింది. 

ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. సోమవారం లోపు సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఉద్యోగుల జీతాలను యాజమాన్యం నిలిపివేసింది.

49,190 మంది ఆర్టీసీ కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలంటూ కార్మికులు హైకోర్టును ఆదేశించింది. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించలేదని.. ప్రభుత్వం కక్షపూరితంగా ప్రవర్తిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

మరోవైపు ఆర్టీసీ కార్మికులు తక్షణమే సమ్మె విరమించాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని.. పండుగలు, పాఠశాలలు కొనసాగుతున్న తరుణంలో సమ్మె ఎంతవరకు సమంజసమని న్యాయస్థానం ప్రశ్నించింది.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. తెలంగాణ ప్రజల పట్ల ప్రభుత్వం ఉండదాంటూ ఉన్నత న్యాయస్థానం మండిపడింది. రెండు రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతు పలుకుతున్నట్లు తెలిపారు టీఎన్జీవో నేత రవీందర్ రెడ్డి. సోమవారం టీఎన్జీవో నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీలో సరైన వైద్య సదుపాయం లేదని, పనిగంటలు పెరిగాయని, ఉద్యోగుల భర్తీ జరపడం లేదని ఆయన మండిపడ్డారు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతు పలుకుతున్నట్లు తెలిపారు టీఎన్జీవో నేత రవీందర్ రెడ్డి. సోమవారం టీఎన్జీవో నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు.

ఆర్టీసీ కార్మికులతో కలిసి తాము కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు.

కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని... చర్చలు జరిపితే మిగతా ఉద్యోగ వర్గాలకు పరిష్కారం దొరుకుతుందని రవీందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకుందామని.. కార్మికుల పక్షాన ఉద్యోగ సంఘాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అశ్వత్థామరెడ్డి మీడియాతో ట్లాడుతూ..ఆర్టీసీలో సరైన వైద్య సదుపాయం లేదని, పనిగంటలు పెరిగాయని, ఉద్యోగుల భర్తీ జరపడం లేదని ఆయన మండిపడ్డారు. కార్మికులు ఎంతో కష్టపడ్డప్పటికీ తమకు ఎలాంటి ఫలితాలు అందడం లేదని తెలిపారు.

సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులను తెలంగాణ సమాజానికి వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ నిధులను ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయి పడిందన్నారు.

తాను గతంలో టీఎన్జీవో నేతలపై చేసిన విమర్శలకు చింతిస్తున్నానని అశ్వత్థామరెడ్డి తెలిపారు. భేషజాలు అవసరం లేదని.. తామే టీఎన్జీవో దగ్గరకు వచ్చామని, ఆర్టీసీ సమ్మెకు మద్ధతు ఇవ్వాలని కోరామన్నారు.
 

click me!