పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్:టీఎస్ 13 ఈఎక్స్ 8384 నెంబర్ కేటాయింపు

By narsimha lodeFirst Published Dec 12, 2022, 3:01 PM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి  వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తైంది.  ఈ వాహనానికి నెంబర్ ను కూడా కేటాయించారు అధికారులు. నిబంధనల మేరకే తాము ఈ ప్రక్రియను పూర్తి చేశామని అధికారులు ప్రకటించారు. 

హైదరాబాద్:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది. అన్నీ అనుమతులున్నందునే రిజిస్ట్రేషన్ చేసినట్టుగా రవాణాశాఖాధికారులు చెబుతున్నారు.పవన్ కళ్యాణ్  వారాహి వాహనానికి  టీఎస్  13 ఈఎక్స్ 8384 నెంబర్ కేటాయించారు రవాణాశాఖాధికారులు.వారాహి వాహనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అధికార వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం  సాగుతుంది. ఈ నెల 7వ తేదీన  వాహనం దృశ్యాలను  పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా  షేర్ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ పశ్చిమ రీజినల్ రవాణా శాఖ కార్యాలయంలో ఈ వాహనానం రిజిస్ట్రేషన్ చేయించారు. వారం క్రితమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైందని సమాచారం.  ఈ వాహనం బాడీ సర్టిఫికెట్ ను కూడా పరిశీలించినట్టుగా  రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు ఈ వాహనం ఆర్మీ అధికారులు ఉపయోగించే వాహనాల రంగును పోలి ఉండడంపై  వైసీపీ నేతలు  మండిపడ్డారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారంగా ఈ వాహనానికి అనుమతుల రాబోవని  మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నినాని  ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే  వైసీపీ నేతలు ఎందుకు  తొందరపడి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్ధం కావడం లేదో జనసేన  పొలిటికల్  ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్  చెప్పారు.

also read:అది వారాహి కాదు నారాహి.. దమ్ముంటే ఆ పని చేయి..: పవన్ కల్యాణ్‌కు రోజా చాలెంజ్

 ఈ వాహనం ఆర్మీ అధికారులు ఉపయోగించే వాహనాల రంగును పోలి ఉండడంపై  వైసీపీ నేతలు  మండిపడ్డారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారంగా ఈ వాహనానికి అనుమతుల రాబోవని  మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నినాని  ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే  వైసీపీ నేతలు ఎందుకు  తొందరపడి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్ధం కావడం లేదో జనసేన  పొలిటికల్  ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్  చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా  బస్సు యాత్ర చేయాలని  పవన్ కళ్యాణ్ భావించారు.అయితే కొన్ని కారణాలతో  ఈ బస్సు యాత్రను వాయిదా వేశారు.  జనవాణి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం పూర్తి చేయలేదనే కారణంతో  బస్సు యాత్రను వాయిదా వేసినట్టుగా  ఈ ఏడాది  సెప్టెంబర్  18న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి మాసంలో  బస్సు యాత్రను ప్రారంభించాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారు.  వచ్చే నెలలో  బస్సు యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.  దీంతో  తన యాత్రకు వాహనాన్ని పవన్ కళ్యాణ్ సిద్దం  చేసుుకున్నారు.

ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో  వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో  చూస్తామని పవన్ కళ్యాణ్ ఇటీవలనే ప్రకటించిన విషయం తెలిసిందే.  పవన్ కళ్యాణ్  వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో  వైసీపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో  పవన్ కళ్యాణ్  వ్యూహారచన చేస్తున్నారు.  గత నెలలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో  పవన్ కళ్యాణ్ సుమారు  గంట సేపు  చర్చించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీతో చర్చల తర్వాత  పవన్ కళ్యాణ్ వైఖరిలో కొంత మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  2023 జనవరి  27 వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నియోజకవర్గం నుండి ఇచ్ఛాపురం వరకు  లోకేష్ యాత్రను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల గుండా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నారు. 
 

click me!