శెభాష్.. పవన్ ఫ్యాన్స్

Published : Nov 27, 2016, 08:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
శెభాష్.. పవన్ ఫ్యాన్స్

సారాంశం

నిమ్స్ లో పాతనోట్లకు కొత్త నోట్లు ఇస్తున్న అభిమానులు బ్యాంకుల బంద్ నేపథ్యంలో రోగులు ఇబ్బంది పడకుండా సాయం

 

సామాన్యుల కష్టాలపై వెంటనే స్పందించే కొద్దిమంది కళాకారుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇప్పడు జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోనూ కొత్త ఒరవడి సృష్టించేందుకు సన్నద్దమవుతున్నారు.

 

నోట్ల రద్దుపై దేశమంతా గగ్గోలు పెడుతుంటే... ప్రతిపక్షాలు అధికార పార్టీలను తిట్టడం.. అధికార పార్టీలు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడటమే తప్ప... సామాన్యుల కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదు.

 

ఈ నోట్ల రద్దు నాటకంపై అన్ని పార్టీలు మొసలికన్నీరు కారుస్తున్నవే. అయితే.. వీటికి భిన్నంగా పవన్ కల్యాణ్ జనసేన ప్రజల ను ఆదుకునేందుకు ఉడతా భక్తిగా తన వంతు సాయం చేస్తోంది.

 

అది కూడా ప్రచార ఆర్భాటానికి దూరంగా...తకీ విషయం ఏంటంటే పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల నుంచి పాత రూ. 500, 1000 నోట్లను తీసుకుని కొత్త నోట్లను అందిస్తున్నారు.

 

ఆదివారం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, మందులను ఆపార్టీ కార్యకర్తలు పంచి పెట్టారు. అనంతరం పేద రోగుల దగ్గర్నుంచి పాత నోట్లను తీసుకుని కొత్త నోట్లను అందించారు. ఈ సందర్బంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ... రెండు రోజులపాటు బ్యాంకులకు సెలవు వచ్చిన నేపథ్యంలో రోగులు ఇబ్బంది పడోద్దనే పాత నోట్లను తీసుకుని కొత్త నోట్లను ఇస్తున్నామన్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో కేటీఆర్ | KTR | Lal Darwaza Bonalu Celebrations
Peddi Sudarshan Reddy కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం | KCR | Asianet News Telugu